ETV Bharat / sports

ఖేల్​రత్న పోటీలో తెలుగమ్మాయి కోనేరు హంపి - చెస్ ఖేల్​రత్న నామినీ

తెలుగమ్మాయి, ప్రపంచ ఛాంపియన్ కోనేరు హంపిని ప్రతిష్ఠాత్మక ఖేల్​రత్న పురస్కారానికి నామినేట్ చేసింది చెస్ సమాఖ్య. మరో ఏడుగురి పేర్లను అర్జున అవార్డుకు సిఫార్సు చేసింది.

Humpy for Khel Ratna award
కోనేరు హంపి
author img

By

Published : Jul 1, 2021, 3:56 PM IST

ర్యాపిడ్ చెస్ ప్రపంచ ఛాంపియన్, తెలుగు తేజం కోనేరు హంపిని దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్​రత్నకు నామినేట్ చేసింది అఖిల భారత చెస్ సమాఖ్య. గతేడాది ఆన్​లైన్​లో జరిగిన చెస్ ఒలింపియాడ్​లో విజేతగా నిలిచిన భారత జట్టులో సభ్యురాలు హంపి. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్​లో మూడో స్థానంలో కొనసాగుతోందీ క్రీడాకారిణి. ఇప్పటికే హంపి అర్జునతో పాటు పద్మశ్రీ అవార్డులను అందుకుంది.

అలాగే విదిత్ గుజ్రాతి, ఆదిబన్, ఎస్​పీ సేతురామన్, లలిత్ బాబు, భక్తి కులకర్ణి, పద్మిని రౌత్​లను అర్జున అవార్డు కోసం సిఫార్సు చేసింది చెస్ సమాఖ్య. గతేడాది ఒలింపియాడ్​లో విజేతగా నిలిచిన భారత జట్టుకు కెప్టెన్​గా వ్యవహరించాడు గుజ్రాతి.

ఇవీ చూడండి: ఖేల్​రత్న రేసులో శ్రీకాంత్, సాయి ప్రణీత్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.