ETV Bharat / sports

ఒక్క కిడ్నీతోనే ఆ పతకాన్ని సాధించా: అంజు బాబీ

author img

By

Published : Dec 7, 2020, 9:28 PM IST

ఒక్క కిడ్నీతోనే ప్రపంచ ఛాంపియన్​షిప్​లో పతకాన్ని సాధించానని లాంగ్​ జంప్​ క్రీడాకారిణి అంజు బాబీ జార్జ్ చెప్పింది​. అనేక రకాల సమస్యలున్నా వాటిని ఎదుర్కొని అగ్రస్థానంలో నిలిచానని తెలిపింది.

Achieved success with single kidney:Anju Bobby George's stunning revelation
ఒక్క కిడ్నీతోనే ఆ ఘనత సాధించా: అంజు

2003లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్​లో భారత లాంగ్​ జంప్​ క్రీడాకారిణి అంజు బాబీ జార్జ్ కాంస్య పతకం సాధించింది​. అయితే ఒక్క కిడ్నీతోనే ఈ ఘనత సాధించినట్లు సోమవారం ట్విట్టర్​ వేదికగా వెల్లడించింది. ఈ విషయమై స్పందించిన కేంద్ర క్రీడా మంత్రి కిరణ్​ రిజిజు.. దేశాన్ని గర్వించేలా ప్రదర్శన చేశావని ట్వీట్ చేశారు. అంజు.. తన భర్త రాబర్ట్​ బాబీ జార్జ్​ నేతృత్వంలో మరింతగా రాణించింది.

"మీరు నమ్ముతారో లేదో తెలియదు. ఒకే కిడ్నీతో ప్రపంచ అగ్రస్థాయికి చేరిన వ్యక్తుల్లో నేను ఒకరిని. పెయిన్​ కిల్లర్​లతో అలర్జీ, పాదాలలో కదలిక లేకపోవడం లాంటి అనేక సమస్యల మధ్య ఆ ఘనత (2003 ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్​)​ సాధించగలిగాను. అదంతా కోచ్​ చేసిన మాయతో పాటు ఆయన ప్రతిభకు ఉదాహరణ"

- అంజు బాబీ జార్జ్​, భారత క్రీడాకారిణి

  • Anju, it's your hard work, grit and determination to bring laurels for India supported by the dedicated coaches and the whole technical backup team. We are so proud of you being the only Indian so far to win a medal in the World Athletic Championship! https://t.co/8O7EyhF2ZC pic.twitter.com/qhH2PQOmNe

    — Kiren Rijiju (@KirenRijiju) December 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తన సంకల్పం ద్వారానే అంజు ఆ ఘనత సాధించగలిగారని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్​ రిజిజు తెలిపారు.

"అంజు.. ఇది నీ అంకితభావానికి, కృషికి నిదర్శనం. నీకున్న కోచ్​లు, సహాయ బృందం మద్దతుతో పురస్కారాలను తీసుకురావడం చాలా గొప్ప విషయం. ప్రపంచ అథ్లెటిక్​ ఛాంపియన్​షిప్​లో పతకం సాధించిన ఏకైక భారతీయురాలిగా నీ వల్ల మేమెంతో గర్వంగా భావిస్తున్నాం"

- కిరణ్​ రిజిజు, కేంద్ర క్రీడాశాఖ మంత్రి

అంజు బాబీ జార్జ్​ సాధించిన పతకాల వివరాలు:

ఈవెంట్​ వేదిక సంవత్సరం విభాగం పతకం
ప్రపంచ​ ఛాంపియన్​షిప్​ పారిస్ 2003​ లాంగ్​ జంప్​ కాంస్యం
ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్​ మోంటే కార్లో 2005 లాంగ్​ జంప్స్వర్ణం
కామన్​వెల్త్​ గేమ్స్​ మాంచెస్టర్​ 2002 లాంగ్​ జంప్కాంస్యం
ఆసియా క్రీడలు బుసాన్​ 2002 లాంగ్​ జంప్స్వర్ణం
ఆసియా క్రీడలు దోహా 2006 లాంగ్​ జంప్రజతం
ఆసియా ఛాంపియన్​షిప్​ ఇంచియాన్ 2005 లాంగ్​ జంప్స్వర్ణం
ఆసియా ఛాంపియన్​షిప్​ అమన్ 2007 లాంగ్​ జంప్రజతం

ఇదీ చూడండి: ధోనీ, కోహ్లీ తర్వాత హార్దిక్ పాండ్యనే అలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.