ETV Bharat / sports

గెలిచిన రెండేళ్లకు హిమదాస్​ బృందానికి స్వర్ణం.. కారణమిదే.? - Jakarta games news

ఆసియా గేమ్స్​-2018లో మిక్స్​డ్​ రిలేలో పాల్గొన్న భారత బృందం తాజాగా స్వర్ణం సొంతం చేసుకుంది. అద్భుతమైన ప్రదర్శన చేసినా చివరికి రెండో స్థానంలో రజతంతో సరిపెట్టుకున్న హిమదాస్​ బృందానికి అదృష్టం కలిసి వచ్చింది. ఇందుకు కారణం తెలియాలంటే ఇది చదవాల్సిందే.

himadas asian games gold
గెలిచిన రెండేళ్లకు హిమదాస్​ బృందానికి స్వర్ణం.. కారణమిదే.?
author img

By

Published : Jul 23, 2020, 9:51 PM IST

ఇండోనేసియాలోని జకర్తా వేదికగా 2018లో జరిగిన ఆసియా గేమ్స్​లో.. 4×400 మిక్స్​డ్​ రిలే విభాగంలో రజతం సాధించింది భారత బృందం. ఆనాడు జట్టుగా మహమ్మద్​ అనాస్​, ఎమ్.ఆర్​​ పూవమ్మ, హిమదాస్, అరోకియా రాజీవ్​ బరిలోకి దిగారు. అయితే పోటీలో బహ్రెయిన్​ బృందం తొలిస్థానం కైవసం చేసుకొని పసిడి సొంతం చేసుకుంది. 3:15.71 సెకన్ల టైమింగ్‌తో రెండో స్థానంలో నిలిచింది హిమదాస్​ బృందం.

అయితే తాజాగా జరిగిన డోపింగ్​ పరీక్షలో బహ్రెయిన్​ జట్టులోని స్టార్​ అథ్లెట్​ కెమి అదెకోయా డోపిగా తేలడం వల్ల ఆమెపై నాలుగేళ్ల నిషేధం విధించారు. అంతేకాకుండా వాళ్లకు ఇచ్చిన బంగారు పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. దాన్ని తర్వాతి స్థానంలో ఉన్నహిమదాస్​ జట్టుకు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు భారత అథ్లెటిక్స్​ సమాఖ్య. నాలుగో స్థానంలో ఉన్న అను రాఘవన్​ బృందం మూడో ర్యాంక్​కు చేరి కాంస్యం ఖాయం చేసుకున్నారు.

దీనితో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. ఆ ఏడాది 20 పతకాలు గెలిచిన భారత ఆటగాళ్లు.. ఎనిమిది పసిడి, 9 రజత, 3 కాంస్య పతకాలు సాధించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.