ఎఫ్‌ఐహెచ్ ప్రొ హాకీ లీగ్(fih hockey pro league 2021)లో తొలిసారి ఆడే అవకాశం భారత జట్టుకు లభించింది. నెదర్లాండ్స్ వేదికగా ఈనెల 13న ఆరంభమయ్యే సీజన్-3లో భారత్(india women hockey)తో పాటు స్పెయిన్ కూడా ఆడనుంది. కొవిడ్ కారణంగా తమ దేశాల్లో అంతర్జాతీయ ప్రయాణ నిబంధనలు ఉండడం వల్ల ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ లీగ్(fih hockey pro league 2021) నుంచి వైదొలిగాయి. దీంతో భారత్, స్పెయిన్‌కు ఈ అవకాశం దక్కింది.
"ఈ ఏడాది ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రొ లీగ్ సీజన్-3లో భారత్, స్పెయిన్ ఆడబోతున్నాయి. వచ్చే సీజన్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తిరిగి ఆడతాయి" అని ప్రపంచ హాకీ సమాఖ్య వెల్లడించింది.
ఇప్పటికే భారత్(india women hockey), స్పెయిన్ పురుషుల జట్లు కూడా హాకీ ప్రొ లీగ్(fih hockey pro league 2021)లో పోటీపడుతున్నాయి. వీరు ఆడే తేదీలు, వేదికల్లోనే మహిళల జట్లను కూడా ఆడించే ప్రయత్నం చేస్తామని సమాఖ్య తెలిపింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్, స్పెయిన్ మహిళల జట్లు అద్భుతంగా ఆడాయి. రాణి రాంపాల్ సారథ్యంలోని భారత్.. ప్రపంచ నంబర్‌వన్ ఆస్ట్రేలియాకు షాకిచ్చి తొలిసారి సెమీఫైనల్ చేరగా.. స్పెయిన్ త్రుటిలో సెమీస్ బెర్తు చేజార్చుకుంది.