అన్నీ అనుకున్నట్లు జరిగితే 2023 హాకీ ప్రపంచకప్ భారత్‌లో జరగొచ్చు. అవునూ.. వచ్చే పురుషుల హాకీ ప్రపంచకప్‌ను నిర్వహించేందుకు ఇండియా ఆసక్తి కనబరుస్తోంది. అందుకోసం బిడ్ దాఖలు చేసింది.
ఇప్పటికే భారత్ మూడుసార్లు హాకీ ప్రపంచకప్‌నకు ఆతిథ్యం ఇచ్చింది. 2023లో జనవరి 13 నుంచి 29 వరకు ఈ టోర్నీని నిర్వహించేందుకు ముందుకొచ్చింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ హాకీ సమాఖ్య తెలిపింది. జులై 1-17 (2022) విండోలో టోర్నీని జరిపేందుకు బెల్జియం, మలేసియా కూడా బిడ్ దాఖలు చేశాయి.
మహిళా హాకీ ప్రపంచకప్ నిర్వహించేందుకు ఐదు దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. జర్మనీ, స్పెయిన్, నెదర్లాండ్స్ జులై 1-17 (2022)విండోలో టోర్నీని జరిపేందుకు ముందుకొచ్చాయి. మలేసియా, న్యూజిలాండ్ జనవరి 13-29 (2023) సమయంలో నిర్వహణ కోసం బిడ్ దాఖలు చేశాయి.
ఈ టోర్నీ జరిపేందుకు ఆసక్తికనబర్చిన దేశాలకు కృతజ్ఞతలు తెలిపింది అంతర్జాతీయ హాకీ సమాఖ్య. వచ్చే నెల 19న ఆతిథ్య దేశాలను ప్రకటిస్తామని స్పష్టం చేసింది.
ఇవీ చూడండి.. భారత్ మూడో టెస్టు కోసం సైనికులకు ఉచిత టికెట్లు