ETV Bharat / sports

'టోక్యో ఒలింపిక్స్​ హాకీలో పతకం ఖాయం'

వచ్చే ఏడాది టోక్యో వేదికగా జరగనున్న ఒలింపిక్స్​లో భారత పురుషుల హాకీ జట్టు పతకం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు మాజీ కెప్టెన్ సర్దార్​ సింగ్​. గతేడాది నుంచి జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉందని కితాబిచ్చాడు.

India have realistic chance of winning medal in Tokyo, says Sardar Singh
టోక్యో ఒలింపిక్స్​ హాకీలో కచ్చితంగా పతకం సాధిస్తారు
author img

By

Published : Jul 21, 2020, 10:52 AM IST

మన్​ప్రీత్​ సింగ్​ నాయకత్వంలో భారత పురుషుల హాకీ జట్టు.. టోక్యో ఒలింపిక్స్​లో కచ్చితంగా పతకం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు మాజీ హాకీ కెప్టెన్​ సర్దార్​ సింగ్. ​1980 మాస్కో ఒలింపిక్స్​లో భారత హాకీ జట్టు చివరిసారిగా బంగారు పతకాన్ని సాధించింది. అప్పటి నుంచి 8 విశ్వక్రీడల్లో పాల్గొన్నా.. పతకం సాధించడంలో 'మెన్​ ఇన్​ బ్లూ' విఫలమైంది.

India have realistic chance of winning medal in Tokyo, says Sardar Singh
భారత పురుషుల హాకీ జట్టు మాజీ కెప్టెన్​ సర్దార్​ సింగ్​

"314 అంతర్జాతీయ మ్యాచ్​లు ఆడినా.. ఒలింపిక్స్​లో పతకాన్ని సాధించలేకపోయినందుకు చింతిస్తున్నాం. కానీ, ప్రస్తుత జట్టు గతేడాది నుంచి ప్రదర్శనలో బలంగా ఎదుగుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో అంతర్జాతీయ హాకీ సమాఖ్య నిర్వహించిన లీగ్​లో ఆడిన విధానం చూస్తే.. టోక్యో ఒలింపిక్స్​లో పతకాన్ని సాధించగలరన్న నమ్మకం మరింత బలపడింది.

-సర్దార్​ సింగ్​, భారత పురుషుల జట్టు మాజీ కెప్టెన్​

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని టోక్యో ఒలింపిక్స్​ను 2021 వేసవికి వాయిదా వేశారు. దీంతో ప్రాక్టీసు చేయడానికి అదనపు సమయం లభిస్తుందని సర్దార్​ సింగ్​ అభిప్రాయపడ్డాడు.

"వచ్చే ఏడాది భారత హాకీ జట్టుకు చాలా క్లిష్టమైనది. కొత్త ప్రతిభను పెంపొందిచుకోవడానికి వారికి సమయం ఉంది. రాజ్​ కుమార్​, దిల్​ప్రీత్​, వివేక్​ సాగర్​, గుర్సాహిబ్​ వంటి యువ ఆటగాళ్ల ప్రయత్నం గొప్పగా ఉంది. గత రెండు, మూడేళ్ల నాటి పరిస్థితితో పోల్చుకుంటే ప్రస్తుతం కొంచెం మెరుగ్గా ఉన్నామని భావిస్తున్నా" అని సర్దార్​ సింగ్​ వెల్లడించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.