ETV Bharat / sports

ఎఫ్​ఐహెచ్​ లీగ్​: అర్జెంటీనాపై భారత్ విజయం​ - అర్జెంటీనాపై భారత్ విజయం​

ఎఫ్​ఐహెచ్​ ప్రో లీగ్​లో భారత్​ వరుసగా రెండో మ్యాచ్​లో విజయం సాధించింది. ఆతిథ్య అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్​లో 3-0తో ఇండియా జట్టు గెలుపొందింది. హర్మన్​ప్రీత్​ సింగ్, లలిత్​ ఉపాధ్యాయ్​, మన్​దీప్​ సింగ్​.. మూడు గోల్స్​తో భారత్​కు విజయాన్ని అందించారు.

India dominate Argentina to register emphatic 3-0 win in FIH Pro League
ఎఫ్​ఐహెచ్​ లీగ్​, అర్జెంటీనాపై భారత్ విజయం​
author img

By

Published : Apr 12, 2021, 3:08 PM IST

Updated : Apr 12, 2021, 5:24 PM IST

అర్జెంటీనా వేదికగా జరిగిన ఎఫ్​ఐహెచ్​ ప్రో లీగ్​లో భారత హాకీ జట్టు విజయం సాధించింది. ఆతిథ్య అర్జెంటీనా టీమ్​పై 3-0 తేడాతో గెలుపొందింది. భారత ప్లేయర్లలో హర్మన్​ప్రీత్​ సింగ్​(11వ నిమిషంలో), లలిత్​ ఉపాధ్యాయ్(25వ నిమిషంలో), మన్​దీప్​ సింగ్​(58వ నిమిషంలో) గోల్స్​ సాధించారు.

ఇదీ చదవండి: 'ఫిట్​నెస్​తో శారీరక, మానసిక సమస్యలకు చెక్​'

తొలి అర్ధ భాగంలో అర్జెంటీనా ఆటగాళ్లు భారత్​పై పైచేయి సాధించేలా కనిపించారు. కెరీర్​లో 50వ అంతర్జాతీయ మ్యాచ్​ ఆడుతున్న క్రిషన్​ బహదూర్​ పాఠక్​.. మూడు గోల్స్​ను కాపాడాడు. ఆ తర్వాత భారత్ పుంజుకుంది. 11వ నిమిషంలో హర్మన్​ తొలి గోల్​ కొట్టాడు. రెండు రోజుల వ్యవధిలో హర్మన్​ప్రీత్​కు ఇది వరుసగా మూడో గోల్.

ప్రస్తుత విజయంతో భారత్​ లీగ్​ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. ఏప్రిల్​ 13, 14న ఆతిథ్య జట్టుతోనే భారత్​ మరో రెండు మ్యాచ్​లు ఆడనుంది.

ఇదీ చదవండి: 'ఐపీఎల్​లోనూ దేశవాళీ ఫామ్​ను కొనసాగిస్తా'

Last Updated : Apr 12, 2021, 5:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.