ETV Bharat / sports

'స్వేచ్ఛగా ఆడితే విజయం మనవెంటే' - టోక్యో ఒలింపిక్స్​పై హాకీ కోచ్​ స్జోర్డే మారిజ్నే

ర్యాంకింగ్స్​లో పదో స్థానంలో ఉన్నప్పటికీ.. టోక్యో ఒలింపిక్స్​లో భారత మహిళల హాకీ జట్టు అత్యుత్తమ ప్రదర్శన చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు కోచ్ స్జోర్డ్​ మారిజ్నే. స్వేచ్ఛగా, నిర్భయంగా ఆడితే ఫలితం దానంతట అదే వస్తుందని తెలిపాడు. ఇటీవలి కాలంలో మంచి ప్రదర్శనలు చేస్తున్న రాణీ రాంపాల్​ నేతృత్వంలోని జట్టుపై ఈ మెగా ఈవెంట్​లో అంచనాలు భారీగా ఉన్నాయని 'ఈటీవీ భారత్​'తో ముఖాముఖీలో పేర్కొన్నాడు.​

Sjoerd Marijne, Indian women's hockey team coach
స్జోర్డే మారిజ్నే, భారత మహిళల కోచ్
author img

By

Published : Jul 4, 2021, 11:07 AM IST

బరిలోకి దిగాక నిర్భయంగా, స్వేచ్ఛగా ఆడితే మంచి ఫలితం దక్కుతుందని అంటున్నాడు భారత మహిళల హాకీ జట్టు కోచ్​ స్జోర్డ్​ మారిజ్నే. ఇటీవలి కాలంలో సానుకూల ఫలితాలతో రాణిస్తున్న రాణీ రాంపాల్ నాయకత్వంలోని జట్టుపై టోక్యో ఒలింపిక్స్​లో భారీ అంచనాలే ఉన్నాయంటున్నాడు. మెరుగైన ఫిట్​నెస్, మ్యాచ్​లపై మంచి అవగాహన, పోటీతత్వం, బలమైన జట్లపై ఇటీవలి ప్రదర్శనలు ఈ సారి మన జట్టుకు అదనపు బలాలుకానున్నాయని తెలిపాడు. 1980 ఒలింపిక్స్​లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన మహిళల హాకీ జట్టు.. ఈసారి అంచనాలు అందుకుంటుందా? రాణీ రాంపాల్​ నాయకత్వంలో టోక్యో ఒలింపిక్స్​లో పాల్గొంటున్న సందర్భంగా మారిజ్నే 'ఈటీవీ భారత్'​తో ముఖాముఖిలో పాల్గొన్నాడు.

ఫిట్​నెస్​ విషయంలో భారత జట్టు చాలా మెరుగుపడింది. ఇతర బలమైన జట్లతో వారిని ఎలా పోల్చుతారు?

మా ఆటగాళ్ల ఫిట్​నెస్​ బాగుంది. నాకు వేరే జట్ల గురించి తెలియదు. వారి శిక్షణ ఎలా సాగుతోందో నేనైతే చూడలేదు. అలా పోల్చి చూడాల్సిన అవసరం లేదు. టోక్యోలో ఫిట్​నెస్​ అనేది కీలక పాత్ర పోషించనుంది. తొలి మ్యాచ్​కు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉంటారు. కానీ, దానిని చివరి వరకు కొనసాగించగలగాలి. గతేడాది మొత్తం మా ఆటగాళ్లు మంచి శిక్షణ పొందారు. జట్టులోని ప్రతి ఒక్కరూ పూర్తి ఫిట్​నెస్​తో ఉన్నారు.

ర్యాంకింగ్స్​లో భారత్ ప్రస్తుతం పదో స్థానంలో ఉంది​. అయినప్పటికీ ఈ మెగా ఈవెంట్​లో రాణిస్తుందనే నమ్మకం ఉందా?

ర్యాంకింగ్స్​లో పదో స్థానంలో ఉన్నప్పటికీ.. భారత జట్టు ఈ విశ్వక్రీడల్లో రాణిస్తుందనే నమ్మకం ఉంది. ర్యాంకింగ్​లను మేం పట్టించుకోం. బలమైన జట్టుతో ఆడేటప్పుడు అలాంటి విషయాలకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన పని లేదు. మా ఆత్మవిశ్వాసం ముందు ఈ ర్యాంకింగ్​లు ఏం పనిచేయవు.

ఒలింపిక్స్​ వంటి పెద్ద టోర్నీల్లో మానసికంగా దృఢంగా ఉండడం చాలా ముఖ్యం. దీనిపై మీరేమంటారు?

అవును, ఇది నిజమే. టోర్నీ ఆరంభంలోనే అగ్రస్థానంలో ఉన్న జట్టుతో ఆడి అందులో గెలిస్తే సంతోషపడాలి. ఓడిపోతే ప్రశాంతంగా ఉండాలి. భావోద్వేగాలను ఎలా నియంత్రించాలన్నది తెలుసుకోవాలి. ఒక్క మ్యాచ్ ఓడిపోగానే మొత్తం అయిపోయినట్టు కాదు. తర్వాత మ్యాచ్​లో మెరుగైన ప్రదర్శన చేయాలనేది గుర్తుంచుకోవాలి. లేకపోతే ముందుకు సాగడం చాలా కష్టం.

ఇదీ చదవండి: 'షెడ్యూల్​ ప్రకారం ఒలింపిక్స్​ జరిగితే పతకం ఖాయం!'

అర్జెంటీనా, జర్మనీ పర్యటనల్లో భారత జట్టు మంచి ప్రదర్శన చేసింది. ఈ ఆత్మవిశ్వాసం టోక్యో ఒలింపిక్స్​కు సరిపోతుందా?

నాకు తెలిసి ఈ రెండు టూర్లలో భారత జట్టు అత్యుత్తమ ప్రదర్శన చేసింది. ఈ విజయాలు మాకు చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి. జర్మనీతో జరిగిన తొలి మ్యాచ్​లో మేము భారీ తేడాతో ఓడిపోయాం. తర్వాత మేమే అవకాశాలను సృష్టించుకున్నాం. అవి పదేపదే రావు. ఏ జట్టుకైనా రెండు, మూడు సార్లు అలాంటి అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి.

ఫిట్​నెస్​తో పాటు మరే విషయంలోనైనా భారత జట్టు మెరుగుపడిందా?

ప్రతి విషయంలో భారత జట్టు మెరుగుపడింది. మానసికంగా, సాంకేతికంగా, ఫిజికల్​గా.. గతంతో పోలిస్తే మాలో చాలా మార్పు వచ్చింది. ప్రతి మ్యాచ్​కు సంబంధించి చర్చించడానికి ఒక సమయాన్ని కేటాయించుకున్నాం.

జట్టు కొవిడ్ బారిన పడినప్పుడు మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి?

కరోనాను జయించే క్రమంలో సిబ్బంది చాలా సహకరించారు. వారంతా ఆటగాళ్లను చాలా బాగా చూసుకున్నారు. కొన్నిసార్లు పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. అలాంటప్పుడు ఓపికతో, సహనంతో ఉండాలి. నేనైతే ప్రశాంతంగా ఉన్నాను. కొవిడ్ నుంచి కోలుకొని తిరిగి ఫిట్​నెస్​ పొందడానికి చాలా సమయం ఉందని నాకు తెలుసు. కొవిడ్​ సోకడం మాకు ఎదురుదెబ్బే. అయినప్పటికీ మేము తిరిగి నిలబడ్డాం.

టోక్యో ఒలింపిక్స్​లో భారత జట్టు నుంచి మీరేమీ కోరుకుంటున్నారు?

బరిలోకి దిగాక స్వేచ్ఛగా, నిర్భయంగా ఆడాలి. ఇవన్నీ జరిగినప్పుడు ఫలితం దానంతట అదే వస్తుంది. ఈ ఈవెంట్​లో మా ఆటగాళ్లు 100శాతం బాగా ఆడతారనే నమ్మకం ఉంది.

ఈసారి భారత జట్టుకు పతకం ఖాయమంటున్నారా?

భవిష్యత్​ గురించి చెప్పడం చాలా కష్టం. మా జట్టు వల్ల కాదని నేను చెప్పట్లేదు. మా ఆటగాళ్లు బాగా ఆడతారనే నమ్మకం మాత్రం ఉంది. అందరూ ఇదే ఆశతో బరిలోకి దిగుతారు. అది చివరి వరకు కొనసాగించిన జట్టే విజేతగా నిలుస్తుంది.

ఇదీ చదవండి: ప్రతిష్ఠాత్మక ఖేల్​రత్న రేసులో స్టార్​ హాకీ ప్లేయర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.