భారత స్టార్ ఫుట్‌బాలర్ సునీల్ ఛెత్రి అరుదైన ఘనత సాధించాడు. ఇదే ఏడాది రెండో సారి ప్రఖ్యాత ఆటగాడు మెస్సీని అధిగమించాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నీల్లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్లలో రెండో స్థానంలో నిలిచాడు.
ఈ జాబితాలో క్రిస్టియానో రొనాల్డో 88 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు. 70 గోల్స్ చేసిన ఛెత్రి రెండో స్థానంలో, 68 గోల్స్‌తో మెస్సీ మూడో స్థానంలో ఉన్నాడు.

ఇదే ఏడాది ఇంటర్ కాంటినెంటల్ కప్‌లో తజికిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డు సాధించాడు సునీల్ ఛెత్రి. భారత్ తరఫున అత్యధిక మ్యాచ్‌లాడిన ఈ ఆటగాడు మాజీ కెప్టెన్ బైచుంగ్ భాటియాను అధిగమించాడు.
ఇది చదవండి: మహిళల ఫిఫా వరల్డ్‌కప్: నాలుగోసారి విజేతగా అమెరికా