దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఎస్‌ఏఎఫ్‌ఎఫ్,saff championship 2021) ఛాంపియన్‌షిప్‌ను భారత్ డ్రాతో మొదలెట్టింది. సోమవారం(అక్టోబర్ 4) బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌ను(saff championship 2021 table) భారత్ 1-1తో ముగించింది. ఇప్పటికే ఏడు సార్లు ఈ ఛాంపియన్‌షిప్ సొంతం చేసుకుని మరోసారి ఫేవరేట్‌గా బరిలో దిగిన ఛెత్రీసేన.. బంగ్లాతో మ్యాచ్‌లో ఆఖర్లో పట్టు విడిచి గెలిచే అవకాశాన్ని దూరం చేసుకుంది.
మ్యాచ్ ఆరంభం నుంచి భారత్(SAFF Championship) ఆధిపత్యం ప్రదర్శించింది. 27వ నిమిషంలో కెప్టెన్ సునీల్ ఛెత్రి గోల్ కొట్టాడు. ఉదాంత నుంచి బంతి అందుకున్న ఛెత్రి సమర్థంగా దాన్ని ప్రత్యర్థి గోల్‌పోస్టులోకి పంపించాడు. అక్కడి నుంచి భారత్ జోరు పెంచింది. బంగ్లా కూడా గోల్స్ కోసం గట్టిగానే ప్రయత్నించినప్పటికీ మన డిఫెన్స్ పటిష్ఠంగా అడ్డుకుంది. 54వ నిమిషంలో భారత ఆటగాణ్ని.. బిశ్వనాథ్ ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నాడని భావించిన రిఫరీ అతనికి నేరుగా రెడ్‌కార్డు చూపించాడు. దీంతో బంగ్లా పది మంది ఆటగాళ్లతోనే ఆడడం వల్ల భారత్ విజయం ఖాయమనిపించింది. కానీ ఆ జట్టు ఆటగాడు అరాఫత్ (74వ నిమిషంలో) తలతో గోల్ చేసి షాకిచ్చాడు. ఆ తర్వాత ఆధిక్యం కోసం భారత్ ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ మ్యాచ్‌లో గోల్‌తో ఛెత్రి తన అంతర్జాతీయ గోల్స్ సంఖ్యను 76కు పెంచుకున్నాడు. అతను మరొక్క గోల్ చేస్తే దిగ్గజం పీలే (77)ను చేరుకుంటాడు. ప్రస్తుతం ఫుట్‌బాల్ ఆడుతున్న ఆటగాళ్లలో అత్యధిక గోల్స్ జాబితాలో.. రొనాల్డో (111), మెస్సి (79), అలీ (77) తర్వాత ఛెత్రి నాలుగో స్థానంలో ఉన్నాడు.
ఇదీ చూడండి: MI Vs RR Preview: ముంబయి-రాజస్థాన్.. కీలకపోరులో గెలుపెవరిది?