అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో పది హ్యాట్రిక్‌లు నమోదు చేసిన తొలి ఆటగాడిగా ఫుట్‌బాల్ దిగ్గజం, పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో(Ronaldo hat trick total) రికార్డు సృష్టించాడు. 2022 ప్రపంచకప్ గ్రూప్-ఎ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో లక్సెంబర్గ్‌తో మ్యాచ్‌లో రొనాల్డో(Ronaldo hat trick International) చెలరేగడంతో పోర్చుగుల్ 5-0తో ఘన విజయం సాధించింది.
రెండు పెనాల్టీలను గోల్‌గా మలిచిన రొనాల్డో(Ronaldo hat trick goals) ఆఖర్లో హెడర్ గోల్ నమోదు చేశాడు. ఫుట్‌బాల్ కెరీర్లో అతడు హ్యాట్రిక్ నమోదు చేయడం అతడికి 58వసారి కావడం విశేషం. మరోవైపు డెన్మార్క్ ప్రపంచకప్‌కు అర్హత పొందిన రెండో జట్టుగా నిలిచింది. బుధవారం మ్యాచ్‌లో డెన్మార్క్ 1-0తో ఆస్ట్రియాపై గెలిచింది. జర్మనీ ప్రపంచకప్‌కు అర్హత పొందిన తొలి జట్టుగా నిలిచింది.
ఇదీ చదవండి:రొనాల్డో ప్రపంచ రికార్డు.. అత్యధిక గోల్స్ వీరుడిగా!