ETV Bharat / sports

స్పానిష్ లీగ్: బార్సిలోనా చివరి మ్యాచ్​కు మెస్సీ దూరం

స్పానిష్ లీగ్​లో భాగంగా బార్సిలోనా జట్టు ఆడనున్న చివరి మ్యాచ్​కు అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ దూరం కానున్నాడు. దీంతో వచ్చే నెల రెండో వారం నుంచి జరగనున్న కోపా అమెరికా ఫుట్​బాల్​ ఛాంపియన్​షిప్​ కోసం అతడికి మరి కాస్త విశ్రాంతి లభించనుంది.

Lionel Messi, Barcelona
లియెనాల్ మెస్సీ, స్టార్ ఫుట్​బాల్ ప్లేయర్
author img

By

Published : May 22, 2021, 5:35 AM IST

స్పానిష్​ లీగ్(లాలిగా) భాగంగా బార్సిలోనా జట్టు చివరి మ్యాచ్​కు స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ దూరం కానున్నాడు. దీంతో కోపా అమెరికా సీజన్​కు ముందు మెస్సీకి మరికొంత అదనపు విశ్రాంతి లభించనుంది. నామమాత్రమైన చివరి మ్యాచ్​లో అతడు అందుబాటులో ఉండడని బార్సిలోనా జట్టు ప్రకటించింది.

తాజా సీజన్​తో బార్సిలోనా జట్టుతో మెస్సీ కాంట్రాక్టు ముగుస్తుంది. తర్వాతి ఏడాది కోసం అతడు అందుబాటులో ఉండేది.. లేనిది స్పష్టం చేయలేదు. కెరీర్ ఆరంభం నుంచి బార్సిలోనాకు ఆడాడు మెస్సీ. బార్సిలోనా విధివిధానాలు నచ్చకపోవడం వల్ల 2019-20 సీజన్​లోనే బార్సిలోనా నుంచి వైదొలగాలని మెస్సీ భావించాడు.

ఇక స్పానిష్ లీగ్​లో అట్లెటికో మాడ్రిడ్​ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. రెండో స్థానంలో రియల్​ మాడ్రిడ్​ జట్టు ఉంది. బార్సిలోనా మూడో స్థానంలో.. సెవిల్లా నాలుగో స్థానంలో నిలిచాయి.

కాగా, కోపా అమెరికా ఫుట్​బాల్​ ఛాంపియన్​షిప్​ జూన్​ 13 నుంచి ప్రారంభం కానుంది. అర్జెంటీనా తొలి మ్యాచ్​లో చిలీతో తలపడనుంది.

ఇదీ చదవండి: 'జపాన్​లో ఎమర్జెన్సీ పెట్టినా.. ఒలింపిక్స్ ఆగదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.