ETV Bharat / sports

బార్సిలోనా స్టార్ ఫుట్​బాలర్ మెస్సీ రికార్డు - బార్సిలోనా తరఫున మెస్సీ 500మ్యాచులు

బార్సిలోనా క్లబ్ తరఫున 500 మ్యాచ్​లు ఆడిన ఘనత సాధించాడు స్టార్​ ఫుట్​బాలర్​ లియోనల్ మెస్సీ. గతేడాది అతడు ఈ క్లబ్​ నుంచి వైదొలగాలనుకున్నాడు. కానీ వ్యక్తిగత కారణాల వల్ల తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.

Messi makes 500th appearance for Barcelona in La Liga
బార్సిలోనా తరఫున 500మ్యాచ్​లు.. మెస్సీ రికార్డు
author img

By

Published : Jan 4, 2021, 12:10 PM IST

లాలిగా టోర్నీలో బార్సిలోనా తరఫున 500 మ్యాచ్​లు పూర్తి చేసుకున్నాడు అర్జెంటీనా స్టార్​ ఫుట్​బాలర్​ లియోనల్ మెస్సీ. అన్ని లీగ్​లలో కలిపి బార్కా తరఫున అతడు 750 మ్యాచ్​లు ఆడాడు. లాలిగాలో ఆదివారం హ్యూస్కాతో జరిగిన పోరులో ఈ ఘనత సాధించాడు.

లాలిగా టోర్నీలో బార్సిలోనా తరఫున 500 మ్యచ్​లు ఆడినవారిలో మెస్సీ రెండోవాడు మాత్రమే. స్పెయిన్​ బయట జన్మించిన వారిలో అతడే మొదటివాడు. అన్ని లీగ్​లలో బార్సిలోనా తరఫున 767 మ్యాచ్​లతో జావీ (స్పెయిన్).. మెస్సీ కంటే ముందున్నాడు.

Messi makes 500th appearance for Barcelona in La Liga
లియో మెస్సీ

క్లబ్ మేనేజ్​మెంట్​తో విభేదాల కారణంగా మెస్సీ గతేడాది బార్సిలోనాకు దూరం కావాలనుకున్నాడు. కానీ కాంట్రాక్టు ప్రకారం అతడు 2021 చివరి వరకు తమతో ఉండాల్సిందేనని, లేదంటే సుమారు రూ.6వేల 103 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని సదరు క్లబ్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మెస్సీ ఈ ఏడాది జట్టుతోనే కొనసాగాలని నిర్ణయించుకున్నాడు.

ఇదీ చూడండి: ఇన్​స్టాలో ఫుట్​బాలర్ రొనాల్డో ప్రపంచ రికార్డు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.