ETV Bharat / sports

పీలే రికార్డు తిరగరాసిన మెస్సీ.. ఏమన్నాడంటే? - Lionel Messi's unexpected response

అర్జెంటీనా ఫుట్​బాలర్ మెస్సీ తాజాగా బ్రెజిల్ దిగ్గజం పీలే రికార్డును తిరగరాశాడు. ఈ సందర్భంగా ఇన్​స్టాలో ఓ ఆసక్తికర పోస్టు పెట్టాడీ ఆటగాడు.

Lionel Messi's unexpected response after breaking Pele's record
పీలే రికార్డు తిరగరాసిన మెస్సీ.. ఏమన్నాడంటే?
author img

By

Published : Dec 23, 2020, 12:20 PM IST

దిగ్గజ ఫుట్​బాలర్​ పీలే రికార్డును తిరగరాశాడు బార్సిలోనా స్టార్​ ఫుట్​బాల్​ ప్లేయర్ లియోనల్​ మెస్సీ. ఒకే క్లబ్​ తరపున అత్యధిక గోల్స్​(644) చేసిన ఆటగాడిగా పీలేను వెనక్కినెట్టాడు. సాన్​టోస్​ క్లబ్​ తరపున గతంలో ఆడిన పీలే చేసిన 643 గోల్సే ఇప్పటివరకు అత్యధికం. ఈ రికార్డు సాధించిన అనంతరం తన ఇన్​స్టా ఖాతాలో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు మెస్సీ.

"ఫుట్​బాల్​ మొదలుపెట్టిన సమయంలో నేను ఒక్క రికార్డు కూడా సాధిస్తానని అనుకోలేదు. ఈరోజు సాధించిన రికార్డు గురించి అయితే అస్సలు ఊహించలేదు. నా సహచరులు, కుటుంబం, స్నేహితులు, ఇలా చాలా ఏళ్లుగా నాకు మద్దతుగా నిలుస్తున్న వారందరికీ ధన్యవాదాలు."

-మెస్సీ, ఫుట్​బాల్ ఆటగాడు

మరో రికార్డుపై కన్ను

బ్రెజిల్ ఆటగాడు పీలే తన దేశం తరఫున 77 గోల్స్ చేశాడు. ఇదే ఇప్పటివరకు ఓ దక్షిణా అమెరికా ఆటగాడి అత్యధికం. అర్జెంటీనా ఫుట్​బాలర్ మెస్సీ ప్రస్తుతం 71 గోల్స్​తో ఉన్నాడు. త్వరలోనే ఈ రికార్డును మెస్సీ తిరగరాసే అవకాశం ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.