భారత ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్ సునీల్ ఛెత్రికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించాడు సునీల్. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని.. త్వరలోనే వైరస్ నుంచి కోలుకొని మైదానంలో అడుగుపెడతానని ఆశాభావం వ్యక్తం చేశాడు.
"ఈ వార్తను పంచుకునేందుకు సంతోషంగా లేను. గురువారం నాకు చేసిన కొవిడ్ టెస్ట్‌లో కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతానికి నా ఆరోగ్యం నిలకడగానే ఉంది. వైరస్ నుంచి త్వరగా కోలుకొని మైదానంలో అడుగుపెడతాను" అని సునీల్ ఛెత్రి ట్వీట్ చేశాడు.