ETV Bharat / sports

'మెస్సీ వీడితే బార్సిలోనాకు గోల్స్ ఎవరు చేస్తారు?' - బార్సిలోనకు గోల్స్ ఎవరు చేస్తారు

బార్సిలోనా జట్టు నుంచి మెస్సీ వైదొలిగితే గోల్స్ ఎవరు చేస్తారో అర్థం కావట్లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు ఈ క్లబ్ హెడ్ కోచ్ రొనాల్డ్ కోమన్. అతడు జట్టుతో కొనసాగాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు.

Messi
మెస్సీ
author img

By

Published : May 17, 2021, 10:17 AM IST

స్పానిష్ ఫుట్​బాల్ క్లబ్ బార్సిలోనాకు స్వస్తి చెప్పాలని ఇప్పటికే నిర్ణయించుకున్నాడు స్టార్ ఫుట్​బాలర్ లియోనల్ మెస్సీ. లా లిగా లీగ్​లో ఈ జట్టుకు ఎన్నో మరపురాని విజయాలనందించి వ్యక్తిగత కారణాల వల్ల వైదొలుగుతున్నట్లు తెలిపాడు. బార్కా తరఫున మెస్సీకి ఇదే చివరి సీజన్. తాజాగా ఈ విషయంపై స్పందించిన బార్సిలోనా హెడ్ కోచ్ రొనాల్డ్ కోమన్​.. మెస్సీ బయటకు వెళితే జట్టు తరఫున ఎవరు గోల్స్ చేస్తారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

"లా లిగాలో జట్టు తరఫున 30 గోల్స్ సాధించాడు. ఎన్నో విజయాలను అందించాడు. అతడు జట్టుతో కొనసాగాలన్నది మా అందరి కోరిక. ఎందుకంటే ఒకవేళ అతడు జట్టు నుంచి వెళిపోతే బార్కా తరపున గోల్స్ ఎవరు చేస్తారో అర్థం కావట్లేదు."

-రొనాల్డ్ కోమన్, బార్సిలోనా హెడ్ కోచ్

ఆదివారం సెల్టా విగోతో జరిగి మ్యాచ్​లో 1-2 తేడాతో ఓటమి పాలైంది బార్సిలోనా. మెస్సీ గోల్​ చేసి శుభారంభాన్ని ఇచ్చినా మిగతా వారు అతడికి మద్దతుగా నిలవలేకపోవడం వల్ల ఓటమి చెందింది. ప్రస్తుతం 37 మ్యాచ్​ల్లో 76 పాయింట్లతో ముడో స్థానంలో కొనసాగుతోంది. మే 23న ఐబర్​తో తన తదుపరి మ్యాచ్ ఆడనుంది.

అర్జెంటినా స్టార్ మెస్సీ బార్సిలోనా క్లబ్​ నుంచి వైదొలుగుతున్నట్లు తెలపగానే ఇతడిపై చాలా క్లబ్​లు ఆసక్తి చూపించాయి. ముఖ్యంగా మాంచెస్టర్ సిటీ, పారిస్ సెయింట్ జెర్మన్ (పీఎస్​జీ) అతడిని కొనుగోలు చేసేందుకు పోటీపడుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.