ETV Bharat / sports

అతడు కొట్టిన గోల్​తో ప్రత్యర్థి ఫసక్​ - 2014 ఫిఫా కప్‌లో మిరొస్లావ్‌ క్లోజ్ గోల్​ అద్భుతం

మిరొస్లావ్‌ క్లోజ్‌.. జర్మనీ స్టార్‌ స్ట్రైకర్‌! గోల్‌ చేసే సమయంలో అతని వేగం, టైమింగ్‌ గొప్పగా ఉంటాయి. తలతో బంతిని నెట్‌లోకి పంపడంలోనూ అతడు దిట్ట. ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్‌ (16) రికార్డు తన పేరిట లిఖించుకున్న ఈ స్టార్‌ చేసిన ప్రతి గోలూ సూపరే. కానీ 2014 ఫిఫా కప్‌లో బ్రెజిల్‌పై అతను చేసిన గోల్‌ మరింత ప్రత్యేకం. ఆ విశేషాలు మీకోసం..

Miroslav Close
మిరొస్లావ్‌ క్లోజ్
author img

By

Published : May 9, 2020, 8:26 AM IST

2014 ప్రపంచకప్‌ సెమీస్‌.. రెండు జట్లూ సమతూకంగానే ఉన్నాయి. కానీ అభిమానుల ఓటు మాత్రం ఎప్పటిలాగే బ్రెజిల్‌ వైపు కాస్త ఎక్కువగా ఉంది. కానీ ఆ మ్యాచ్‌లో రికార్డు గోల్‌ కొట్టి జట్టు విశ్వాసాన్ని అమాంతం పెంచేశాడు క్లోజ్‌. అప్పటికే 11వ నిమిషంలో ముల్లర్‌ కొట్టిన గోల్‌తో బ్రెజిల్‌ కసి మీద ఉంది. ఎలాగైనా దెబ్బకు దెబ్బ తీయాలనే ఉద్దేశంతో ఎదురు దాడులు మొదలుపెట్టింది. అయితే 23వ నిమిషంలో డిఫెన్స్‌లో లోపాలు కనిపెట్టిన క్లోజ్‌.. వేగంగా ముందుకు కదిలాడు.

సహచరుడు అందించిన పాస్‌ను సద్వినియోగం చేస్తూ బంతిని నెట్లోకి కొట్టేయబోయాడు. కానీ కీపర్‌ కాళ్లకు తగిలిన బంతి మళ్లీ వెనక్కి వచ్చింది. అయినా వదలని క్లోజ్‌.. అదే ఊపులో గోల్‌ చేసేశాడు. ఇది ప్రపంచకప్‌లో అతనికి 15వ గోల్‌. అత్యధిక గోల్స్‌ సాధించిన బ్రెజిల్‌ స్టార్‌ రొనాల్డోను సమం చేసిన గోల్‌. ఈ గోల్‌తో మ్యాచ్‌లో జర్మనీ జోరు పెరిగింది. తర్వాత గోల్స్‌ వర్షం కురిసింది.అందులో పడి బ్రెజిల్‌ కొట్టుకుపోయింది.

ఇదీ చూడండి : 'టీ20 ప్రపంచకప్​ జట్టులో ధోనీ ఉంటే మంచిది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.