ETV Bharat / sports

ఫిఫా కౌన్సిల్​లో సభ్యుడిగా భారతీయుడు

ఫిఫా కౌన్సిల్ సభ్యుడిగా 'అఖిల భారత ఫుట్​బాల్ ఫెడరేషన్' అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ ఎన్నికయ్యారు. ఈ పదవి చేపట్టిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు ప్రఫుల్. 2019 నుంచి 2023 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.

author img

By

Published : Apr 6, 2019, 1:32 PM IST

ఫిఫా

'అఖిల భారత ఫుట్​బాల్ ఫెడరేషన్' (ఏఐఎఫ్ఎఫ్) అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్​కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ ఫుట్​బాల్​ సమాఖ్య (ఫిఫా)​లో సభ్యుడిగా ఎన్నికయ్యారు. మలేసియా కౌలాలంపూర్​లో శనివారం 29వ ఆసియా ఫుట్​బాల్ కాన్ఫిడరేషన్ ​(ఏఎఫ్​సీ) సమావేశం జరిగింది. ఇక్కడ నిర్వహించిన ఓటింగ్​లో పటేల్​కు 46 ఓట్లకు గానూ 38 ఓట్లు వచ్చాయి.

ఫిఫా కౌన్సిల్​లో సభ్యుడిగా ఎన్నికైన మొదటి భారతీయుడిగా ప్రఫుల్ పటేల్​ రికార్డులకెక్కారు. ఐదుగురు సభ్యులుండే ప్యానెల్​లో పటేల్ ఒకరు. ఇందులో ఓ మహిళా సభ్యురాలు కూడా ఉంటారు. 2019 నుంచి 2023 వరకు వీరు సేవలందిస్తారు.

"నేను ఈ గౌరవానికి తగిన వాడినని నమ్మి.. మద్దతు తెలిపిన ఏఎఫ్​సీ సభ్యులందరికీ కృతజ్ఞతలు. ఫిఫా కౌన్సిల్​ సభ్యుడి బాధ్యత ఎంతో ప్రతిష్ఠాత్మకమైంది. నా దేశానికే కాదు.. ఆసియా ఖండం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తాను. బాధ్యతలను విధేయతతో నిర్వహిస్తాను. - ప్రఫుల్ పటేల్, ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు.

ప్రఫుల్​కి ఈ గౌరవం దక్కడం పట్ల భారత ఫుట్​బాల్ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఫుట్​బాల్​ క్రీడను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో ప్రఫుల్ ముఖ్య పాత్ర పోషించారని ప్రశంసించారు. ఆ పదవికి ప్రఫుల్ తగిన వ్యక్తి అని ఏఐఎఫ్​ఎఫ్ ఉపాధ్యక్షురాలు సుబ్రతా దత్తా తెలిపారు.

AP Video Delivery Log - 0600 GMT News
Saturday, 6 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0546: UK Assange AP Clients Only 4204697
Police outside Ecuador embassy amid WikiLeaks tweets
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.