2030 ఫిఫా ప్రపంచకప్ నిర్వహణకు అర్జెంటీనా, చిలీ, పరాగ్వే, ఉరుగ్వే దేశాలు కలిసికట్టుగా బిడ్ దాఖలు చేశాయి. ఈ నాలుగు దేశాల అధినేతలు అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో సమావేశమై ఈ విషయమై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.
- ఒక ప్రత్యేకమైన లోకల్ కమిటీని ఏర్పాటు చేయాలని నాలుగు దేశాలు నిశ్చయించుకున్నాయి. ప్రతి దేశం దక్షిణ అమెరికా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌కి సహకరించాలని తీర్మానించారు. దీనిపై బ్యూనస్ ఎయిర్స్లో ఏప్రిల్ 8న చర్చించనున్నారు.
ఫిఫా ప్రపంచకప్ ఆతిథ్యానికి మొదటగా అర్జెంటీనా, ఉరుగ్వే 2017లో సంయుక్త బిడ్‌ను దాఖలు చేశాయి. అనంతరం పరాగ్వే సైతం బిడ్ వేసింది. చివరగా చిలీ ఈ దేశాలతో జతకట్టింది.' అయితే నిర్వహణ కోసం బొలీవియా సైతం ఈ నలుగురితో కలిసేందుకు సమాలోచనలు చేస్తోంది.
తొలిసారి ఉరుగ్వేలో:
తొలి ప్రపంచకప్ 1930లో ఉరుగ్వేలో జరిగింది. ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనాను 4-2తో ఓడించి విజేతగా నిలిచింది అతిథ్య జట్టు.
విపరీతమైన పోటీ:
ఈ నాలుగు దక్షిణ అమెరికా దేశాలకు మొరాకో నుంచి పోటీ ఎదురవుతోంది. వీటితో పాటు బ్రిటన్, ఐర్లాండ్ కలిసి జాయింట్ బిడ్ వేశాయి. గ్రీస్, సెర్బియా, బల్గేరియా, రొమేనియా దేశాలు మరో జట్టుగా బిడ్డింగ్‌లో పాల్గొన్నాయి.
పెద్ద టోర్నీ:
2022లో ఫిఫా ప్రపంచకప్ ఖతార్‌లో జరగనుంది. 2026లో ఈ మెగా టోర్నీని అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. 2030 టోర్నీకి నాలుగు ఖండాల నుంచి 48 జట్లు రానున్నాయి.