ETV Bharat / sports

భారత్​ వేదికగా మహిళల అండర్​-17 ఫుట్​బాల్​ ప్రపంచకప్​

భారత్​ వేదికగా జరగాల్సిన మహిళల అండర్​-17 ఫుట్​బాల్​ ప్రపంచకప్​ను ఫిఫా రద్దు చేసింది. కరోనా వ్యాప్తి కారణంగా రద్దైన ఈ టోర్నీని 2022లో నిర్వహించేందుకు భారత్​కు ఫిఫా మరో అవకాశాన్ని ఇచ్చింది.

FIFA cancels next year's U-17 women's World Cup, India to host 2022 edition
భారత్​ వేదికగా మహిళల అండర్​-17 ఫుట్​బాల్​ ప్రపంచకప్​
author img

By

Published : Nov 18, 2020, 8:40 AM IST

భారత్‌ వేదికగా జరగాల్సిన మహిళల అండర్‌-17 ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ను ఫిఫా రద్దు చేసింది. అయితే ఆ మెగా టోర్నీని నిర్వహించేందుకు మరో అవకాశం ఇచ్చింది. 2022 టోర్నీ ఆతిథ్య హక్కులను కట్టబెట్టింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది నవంబరులో అండర్‌-17 ప్రపంచకప్‌ భారత్‌లో జరగాలి. అయితే కరోనా కారణంగా మొదట ఈ టోర్నీని వచ్చే సంవత్సరం ఫిబ్రవరి-మార్చికి వాయిదా వేశారు. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ మహమ్మారి ఇంకా నియంత్రణలోకి రాని నేపథ్యంలో ఆ టోర్నీని ఫిఫా రద్దు చేయాలని నిర్ణయించింది.

"2020లో జరగాల్సిన రెండు మహిళల యూత్‌ టోర్నీలను మళ్లీ వాయిదా వేయాలని అనుకోవట్లేదు. సభ్య దేశాలతో చర్చించిన అనంతరం అండర్‌-17, అండర్‌-20 టోర్నీలను రద్దు చేయాలన్న నిర్ణయానికొచ్చాం. అయితే 2022 ఎడిషన్‌ ఆతిథ్య హక్కులను.. 2020 టోర్నీలను నిర్వహించాల్సిన దేశాలకు ఇచ్చేందుకు మండలి ఆమోదం తెలిపింది" అని ఫిఫా వెల్లడించింది. 2022లో భారత్‌, కోస్టారికా (అండర్‌-20 మహిళల కప్‌)లలో ఫిఫా టోర్నీలు జరగనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.