ETV Bharat / sports

కరోనా సోకిందని ఆట మధ్యలోనే తప్పించారు!

గురువారం టర్కీ, క్రొయేషియా మధ్య జరిగిన ఫ్రెండ్లీ ఫుట్​బాల్​ మ్యాచ్ నుంచి క్రొయేషియా డిఫెండర్​ డొమాగోజ్​ విడా వైదొలిగాడు. ఈ ఆటగాడికి కరోనా సోకడం వల్ల మ్యాచ్​ నుంచి అర్ధంతరంగా తప్పించినట్లు క్రొయేషియా సాకర్​ సమాఖ్య ఓ ప్రకటనలో తెలియజేసింది.

Croatia defender Vida pulled from match because of virus
కరోనా సోకిందని ఆట మధ్యలోనే తప్పించారు
author img

By

Published : Nov 13, 2020, 5:41 AM IST

టర్కీతో గురువారం జరిగిన ఫ్రెండ్లీ ఫుట్​బాల్​ మ్యాచ్​ నుంచి క్రొయేషియా డిఫెండర్​ డొమాగోజ్​ విడా అర్ధంతరంగా వైదొలిగాడు. సదరు ఆటగాడికి మధ్యలో కరోనా వైరస్​ సోకడం వల్ల అతడిని మ్యాచ్​ నుంచి తప్పించినట్లు క్రొయేషియా సాకర్​ సమాఖ్య తెలిపింది.

టర్కీలో జరిగే మ్యాచ్​కు మూడు రోజుల ముందుగా చేసిన కరోనా పరీక్షల్లో డొమాగోజ్​ విడాకు నెగిటివ్​గా నిర్ధరణ అయ్యింది. కానీ, శనివారం స్వీడన్​తో జరగనున్న నేషన్స్​ మ్యాచ్​ జరగనున్న సందర్భంగా క్రొయేషియా జట్టుకు మరోసారి పరీక్షలు చేయగా అందులో అతడికి వైరస్​ సోకినట్లు తేలిందని సమాఖ్య వెల్లడించింది.

దీంతో ఈ ఫుట్​బాల్​ ప్లేయర్​ ఇస్తాంబుల్​లో 10 రోజుల పాటు స్వీయనిర్బంధంలో ఉండనున్నాడు. జట్టులోని మిగిలిన ఆటగాళ్లు స్వీడన్​తో జరిగే మ్యాచ్​కు సిద్ధమవుతారని సమాఖ్య తెలిపింది. ఈ మ్యాచ్​లో విడాకు ప్రత్యామ్నాయంగా మరో ఆటగాడికి అవకాశం ఇవ్వనున్నారని తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.