పోర్చుగీస్ ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో దశాబ్ద కాలంలో జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ప్రస్తుతం అత్యధికంగా ఆర్జిస్తోన్న ఫుట్‌బాలర్లలో తొలిస్థానంలో ఉన్నాడు. మెస్సీ, నెయిమర్ జూనియర్లు ఇతడి తర్వాత ఉన్నారు. కరోనా కారణంగా ఫుట్‌బాల్ క్లబ్ జువెెంటిస్ జీతాల్లో కోతలకు రొనాల్డో అంగీకరించాడు. అయినా ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తోన్న ఫుట్‌బాల్ ఆటగాడిగా అతడి స్థానం పదిలంగానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఆర్జిస్తున్న అథ్లెట్ల జాబితాలో టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ అగ్రస్థానంలో ఉన్నాడు.
ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ఫుట్‌బాల్ సూపర్స్టార్లు కరోనా కారణంగా వేతనాల్లో కోత ఎదుర్కొంటున్నారు. రెవెన్యూ లోటు వల్ల ఆటగాళ్ల జీతాల్లో కోతలు పెడుతున్నాయి క్లబ్‌లు. 2019లో జీతాలతో పోల్చుకుంటే ఫుట్‌బాల్ ఆటగాళ్లకు ప్రస్తుతం 9 శాతం కోత విధించారు.
ఫుట్‌బాల్ ప్లేయర్లలో అత్యధికంగా ఆర్జించే వారు
1) క్రిస్టియానో రొనాల్డో - రూ.804.2 కోట్లు (రూ.450 కోట్ల జీతం, రూ.345.73 కోట్ల విలువైన ప్రకటనలు)
2) లియోనల్ మెస్సీ - రూ.774.14 కోట్లు (రూ.533 కోట్ల జీతం, రూ.232.9 కోట్ల విలువైన ప్రకటనలు)
3) నెయిమర్ జూనియర్ - రూ.706.5 కోట్లు (రూ.526 కోట్ల జీతం, రూ.180 కోట్ల విలువైన ప్రకటనలు)
ఇదీ చూడండి... ఖేల్‌రత్నకు రాణి రాంపాల్ నామినేట్