ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మరో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఇటలీ ఫుట్‌బాల్ లీగ్ ఛాంపియన్‌షిప్ అయిన 'సిరీ ఏ'లో ఈ సీజన్ (2020-21)లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు.
ఈ లీగ్‌తో పాటు ప్రీమియర్ లీగ్, లా లిగా లీగ్‌ల్లోనూ ఓ సీజన్‌లో టాప్‌స్కోరర్‌గా నిలిచిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు రొనాల్డో. 'సిరీ ఏ' లీగ్ తాజా సీజన్‌లో 36 ఏళ్ల ఈ పోర్చుగల్ స్టార్ 29 గోల్స్ చేశాడు. 2019, 2020లో అతను ఈ లీగ్ అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాడిగా అవార్డులు గెలుచుకున్నాడు.
ఇదీ చూడండి: ఫుట్‌బాల్ స్టార్ రొనాల్డో నుంచి రూ.579 కోట్ల డిమాండ్!