ETV Bharat / sports

ఆ రికార్డు సాధించిన తొలి ఫుట్​బాలర్​గా రొనాల్డో - రొనాల్డో రికార్డు

ఫుట్​బాల్​ చరిత్రలో 760 గోల్స్ కొట్టి.. అత్యధిక గోల్స్​ సాధించిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు స్టార్​ ప్లేయర్​ రొనాల్డో. గురువారం ముగిసిన ఇటలీ సూపర్​ కప్​లో ఈ ఘనతను అందుకున్నాడు. ఈ పోరులో నెపోలి జట్టుపై 2-0తేడాతో విజయం సాధించి తొమ్మిదో​ టైటిల్​ను సొంతం చేసుకుంది జువెంటస్ జట్టు.

RONALDO
రొనాల్డో
author img

By

Published : Jan 21, 2021, 10:56 AM IST

JUVENTUS
జువెంటస్​ విజయోత్సాహం

పోర్చుగల్​కు చెందిన స్టార్​ సాకర్‌ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో అరుదైన రికార్డు సాధించాడు. కెరీర్​లో 760వ గోల్​ సాధించి..​ఫుట్​బాల్​ చరిత్రలోనే అత్యధిక గోల్స్​ సాధించిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.

గురువారం ముగిసిన ఇటలీ సూపర్​ కప్​లో నెపోలి జట్టుపై 2-0తేడాతో విజయం సాధించి తొమ్మిదో​ టైటిల్​ను సొంతం చేసుకుంది జువెంటస్. విజయం సాధించిన ఈ జట్టుకు సారథ్యం వహించిన రొనాల్డో.. ఈ పోరులో రెండు గోల్స్​ కొట్టాడు. ఈ రెండో గోల్​తోనే ఈ మార్క్​ను అందుకున్నాడు.

ఈ విజయం సాధించడంపై రొనాల్డో, జట్టు యాజమాన్యం హర్షం వ్యక్తం చేశారు. ఈ జట్టుకు కోచ్​గా వ్యవహరించిన ఆండ్రియా పిర్లో.. కెరీర్​లో కోచ్​గా తొలి ట్రోఫీని అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నాడు.

ఇదీ చూడండి : అత్యుత్తమ గోల్​ కన్నా శృంగారమే మిన్న: రొనాల్డొ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.