ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో మరో 20 ఏళ్లు ఫుట్‌బాలర్‌గా కొనసాగనని తెలిపాడు. కానీ, జట్టులో ఉన్నంతకాలం గెలుపు కోసం 100 శాతం ప్రయత్నిస్తానని అన్నాడు. శుక్రవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా నెటిజన్లు చూపిన ఆదరాభిమానాలపై హర్షం వ్యక్తం చేశాడు. వారిని ఉద్దేశిస్తూ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ చేశాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"36 ఏళ్లు వచ్చేశాయంటే నమ్మశక్యంగా లేదు. నిన్ననే ఫుట్‌బాల్ మొదలుపెట్టినట్లు అనిపిస్తుంది. కానీ, ఫుట్‌బాల్ జీవితంలో ఎన్నో మలుపులు చూశాను. మొదటి గోల్, మొదటి జట్టు, మొదట ఆడిన బంతి అన్నీ గుర్తున్నాయి. ప్రతి మ్యాచ్‌లో గెలుపు కోసం 100 శాతం కృషిచేశాను. ఆటతీరును మెరుగుపరుచుకునేందుకు ప్రతిరోజు ప్రయత్నిస్తుంటాను.
మీరు చూపిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని. ఫుట్‌బాలర్‌గా 20 ఏళ్ల కెరీర్ పూర్తి చేశాను. ఇంకా 20 ఏళ్లు ఫుట్‌బాలర్‌గానే ఉంటానని గ్యారంటీ ఇవ్వలేను. కానీ, ఉన్నన్ని రోజులు పూర్తి స్థాయిలో ఆడుతానని చెప్పగలను."
-రొనాల్డో, పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్.
ఫుట్‌బాల్ చరిత్రలో ఎన్నో రికార్డులు సాధించాడు క్రిస్టియానో రొనాల్డో. 2020-21లోనూ జువెంటస్ తరఫున 23 మ్యాచ్‌లాడి 22 గోల్స్ చేశాడు.
ఇదీ చదవండి:శ్రీలంక క్రికెట్ కమిటీలో సంగక్కర, మురళీధరన్