స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో కోపంతో మైదానంలో విసిరేసిన చేతి బ్యాండ్‌కు, ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన వేలంలో భారీ ధర పలికింది. 64 వేల యూరోలకు(దాదాపు రూ.55 లక్షలు) ఓ వ్యక్తి సొంతం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని వెన్నెముక కండరాల క్షీణతతో బాధపడుతున్న ఆరు నెలల చిన్నారి సర్జరీ కోసం ఉపయోగించనున్నారు.
ఇంతకీ ఆ బ్యాండ్ కథేంటి?
పోర్చుగల్ జట్టుకు కెప్టెన్‌గా రొనాల్డో.. ఫుట్‌బాల్ ప్రపచంకప్‌లో నేపథ్యంలో గతవారం సెర్బియాతో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఇరు జట్లూ 2-2 గోల్స్‌తో సమానంగా ఉన్నాయి. చివరి నిమిషంలో రొనాల్డో ఓ గోల్ చేశాడు. అంపైర్ దానిని లెక్కలోకి తీసుకోలేదు. ఈ క్రమంలోనే ఆగ్రహానికి గురైన అతడు.. తన చేతికున్న కెప్టెన్ ఆర్మ్ బ్యాండ్‌ను తీసి నేలపై విసిరి వెళ్లిపోయాడు.