ETV Bharat / sports

నాన్న కళ్లే అతడికి మ్యాచ్ చూపించాయి

కొలంబియాలో హృదయాలను హత్తుకునే ఓ సంఘటన చోటుచేసుకుంది. పుట్టుకతోనే అంధుడైన ఓ చిన్నారుడికి ఫుట్​బాల్​ ఆట అంటే ఎంతో ఇష్టం. అందుకోసం తన తండ్రి చూపులేని కొడుకుని స్టేడియంకు తీసుకెళ్లి.. మ్యాచ్ ఆద్యంతం​ ఎలా సాగుతుందో వివరించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​ అయ్యింది.

football
చూపు లేకపోతేనే... నాన్న ఉన్నాడుగా
author img

By

Published : Feb 21, 2020, 11:30 AM IST

Updated : Mar 2, 2020, 1:19 AM IST

ఆ చిన్నారికి ఫుట్‌బాల్‌ అంటే ఎంతో ఇష్టం. తన ఫేవరెట్‌ జట్టు మైదానంలో ఆడుతుంటే గ్యాలరీలో కూర్చుని ప్రత్యక్షంగా చూడాలని ఎంతో ఆశ. కానీ దురదృష్టవశాత్తు పుట్టుకతోనే అంధుడైన ఆ బాలుడు స్టేడియంలోనే కాదు.. టీవీ ముందు కూర్చుని కూడా మ్యాచ్‌ను వీక్షించలేడు. అయినా సరే తన కుమారుడి కోరికను ఎలాగైనా తీర్చాలనుకున్నాడా తండ్రి. చూపులేని కొడుకును స్టేడియంకు తీసుకెళ్లి.. మ్యాచ్‌ ఆద్యంతం ఎలా సాగుతుందో వివరించాడు. హృదయాలను హత్తుకునే ఈ సంఘటన కొలంబియాలో చోటుచేసుకుంది.

సెబాస్టియన్‌ అనే చిన్నారి పుట్టుకతోనే అంధుడు. కానీ అతడికి ఫుట్‌బాల్‌ ఆటంటే చాలా ఇష్టం. తన ఫేవరెట్‌ జట్టు మైదానంలో తలపడుతుంటే ప్రత్యక్షంగా చూడాలని ఆశపడ్డాడు. కుమారుడి ఇష్టాన్ని తెలుసుకున్న సెబాస్టియన్‌ తండ్రి.. బారాన్‌క్విల్లాలోని ఎస్టాడియో మెట్రోపొలిటనో రాబర్టో మెలెండెజ్‌ మైదానంలో జరుగుతున్న ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ మ్యాచ్‌ జరుగుతున్నంతసేపు ప్రతిక్షణం మైదానంలో ప్లేయర్లు ఎలా ఆడుతున్నారో కొడుకుకు వివరించి చెప్పాడు.

ఈ వీడియోను అట్లాంటికో జూనియర్‌ ఫుట్‌బాల్‌ జట్టు అభిమానులు.. జూనియర్‌ ఎస్‌ మి ఫ్యాషన్‌ అనే ఫ్యాన్‌ క్లబ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. కొడుకు కోసం తండ్రి పడుతున్న తపనను చూసి నెటిజన్ల కళ్లు చెమర్చుతున్నాయి. ఆయన ఎంతో గొప్ప తండ్రి అంటు పలువురు భావోద్వేగ సందేశాలు పోస్ట్‌ చేస్తున్నారు.

ఇదీ చూడండి:- మాటల్లో తెంపరి చేతల్లో ట్రంపరి.. ఆయన రూటే సెపరేటు

Last Updated : Mar 2, 2020, 1:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.