జింబాబ్వే క్రికెటర్ ర్యాన్ బర్ల్ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఓ పోస్టుకు ప్రముఖ ఫుట్‌వేర్ సంస్థ పుమా స్పందించింది. తన చిరిగిపోయిన బూట్లను ట్విట్టర్లో పోస్టు చేసిన ర్యాన్.. "మాకు స్పాన్సర్లు దొరికితే.. ప్రతి సిరీస్ తర్వాత ఇలా బూట్లను బాగుచేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తదు. ఎవరైనా ఉన్నారా?" అని ఆ ఫొటో కింద రాసుకున్నాడు. ఈ ట్వీట్‌కు స్పందించిన పుమా.. "ఇకపై మీకు ఆ అవసరం ఉండదు. మీకు బూట్లను మేము స్పాన్సర్ చేస్తాం" అని ట్వీట్ చేసింది.
-
Time to put the glue away, I got you covered @ryanburl3 💁🏽 https://t.co/FUd7U0w3U7
— PUMA Cricket (@pumacricket) May 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Time to put the glue away, I got you covered @ryanburl3 💁🏽 https://t.co/FUd7U0w3U7
— PUMA Cricket (@pumacricket) May 23, 2021Time to put the glue away, I got you covered @ryanburl3 💁🏽 https://t.co/FUd7U0w3U7
— PUMA Cricket (@pumacricket) May 23, 2021
ప్రభుత్వం జోక్యం చేసుకుందనే కారణంతో అంతర్జాతీయ క్రికెట్ నుంచి జింబాబ్వేను 2019లో ఐసీసీ నిషేధించింది. తిరిగి అదే ఏడాది అక్టోబర్‌లో నిషేధం ఎత్తివేసింది. అయినప్పటికీ కొవిడ్ కారణంగా జరగాల్సిన పర్యటనలు వాయిదా పడ్డాయి. ఈ ఏడాది పాకిస్థాన్ ఆ దేశంలో పర్యటించింది. అయినా బోర్డుకు తగినంత ఆదాయం లేదు.
స్పాన్సర్‌షిప్‌లు, బ్రాడ్కాస్ట్ హక్కుల ద్వారా ఓవైపు సంపన్న క్రికెట్ బోర్డులు లక్షల కొద్దీ ఆదాయాన్ని గడిస్తున్న నేటి రోజుల్లో.. జింబాబ్వే క్రికెట్ బోర్డు పరిస్థితి దయనీయంగా ఉంది! ఆటగాళ్లకు కనీసం బూట్లు కొనలేని స్థితిలో ఉంది.
ఇదీ చదవండి: 'సుశీల్.. ఎందుకిలా చేశావ్?'