కరోనాపై పోరులో భాగంగా విరాళాల సేకరణకు 'చెక్‌మేట్ కొవిడ్' పేరుతో ఆన్లైన్ ప్రదర్శనలు ఇవ్వడానికి.. భారత చెస్ క్రీడాకారులు విశ్వనాథన్ ఆనంద్, హంపి, నిహాల్ సారిన్తో పాటు పలువురు చెస్ క్రీడాకారులు ముందుకొచ్చారు. ఇందులో భాగంగా జూన్ 13న పలువురు ప్రముఖులతో ఆనంద్ పోటీకి దిగనున్నారు. తద్వారా వచ్చిన నిధులను మహమ్మారితో పోరాడుతున్న వారికి సాయం చేయనున్నారు.
ప్రపంచ మాజీ ఛాంపియన్ విశ్వనాథన్.. క్రికెటర్ చాహల్‌తో పాటు రితీష్ దేశ్‌ముఖ్, ఆమిర్ ఖాన్, అర్జిత్ సింగ్, అనన్య బిర్లా, మను కుమార్ జైన్‌లతో ఆన్లైన్లో తలపడనున్నారు. ఈ విషయాన్ని యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ ఇన్‌స్టా వేదికగా వెల్లడించింది.
"రాబోయే ఆసక్తికరమైన మ్యాచ్‌ల కోసం ఉత్తేజంగా ఎదురుచూస్తున్నాను" అంటూ విశ్వనాథన్ ఆనంద్ కూడా ట్విట్టర్లో ఓ వీడియోను షేర్ చేశారు.
-
Looking forward to playing some exciting chess with:
— Viswanathan Anand (@vishy64theking) June 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Aamir Khan@riteishd@NGEMovies@arijitsingh@ananya_birla@nikhilkamathcio@manukumarjain@yuzi_chahal@KicchaSudeep
See you all this Sunday, June 13th at 5 pm to #CheckmateCovid with @AkshayaPatra, @chesscom_in & @Prachura1 pic.twitter.com/wSEZuckFB0
">Looking forward to playing some exciting chess with:
— Viswanathan Anand (@vishy64theking) June 12, 2021
Aamir Khan@riteishd@NGEMovies@arijitsingh@ananya_birla@nikhilkamathcio@manukumarjain@yuzi_chahal@KicchaSudeep
See you all this Sunday, June 13th at 5 pm to #CheckmateCovid with @AkshayaPatra, @chesscom_in & @Prachura1 pic.twitter.com/wSEZuckFB0Looking forward to playing some exciting chess with:
— Viswanathan Anand (@vishy64theking) June 12, 2021
Aamir Khan@riteishd@NGEMovies@arijitsingh@ananya_birla@nikhilkamathcio@manukumarjain@yuzi_chahal@KicchaSudeep
See you all this Sunday, June 13th at 5 pm to #CheckmateCovid with @AkshayaPatra, @chesscom_in & @Prachura1 pic.twitter.com/wSEZuckFB0
చాహల్.. చెస్లోనూ దిట్టే..
తన వైవిధ్యమైన స్పిన్ బౌలింగ్‌తో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టే యుజ్వేంద్ర చాహల్.. ఒకప్పుడు చెస్ ప్లేయర్. ప్రపంచ యూత్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అతడు యుక్త వయసులో క్రికెట్ కంటే ఎక్కువగా చెస్నే ఇష్టపడేవాడు.
ఇదీ చదవండి: చెక్‌మేట్ కొవిడ్: ఆనంద్- హంపి విరాళాల సేకరణ