ETV Bharat / sports

అతడి ప్రోత్సాహంతోనే చాహల్ మళ్లీ ఫామ్​లోకి..!

Yuzvendra Chahal On Rohit Sharma: వెస్టిండీస్​తో ఆదివారం జరిగిన వన్డే మ్యాచ్​లో 4 వికెట్లు తీసి మళ్లీ ఫామ్​లోకి వచ్చాడు భారత స్పిన్నర్ చాహల్. అయితే ఇందులో కెప్టెన్​ రోహిత్ శర్మ పాత్ర ఉన్నట్లు చెప్పుకొచ్చాడు చాహల్. రోహిత్​ తనను నమ్మి ప్రోత్సహించాడని తెలిపాడు.

yuzvendra chahal on rohit sharma
రోహిత్ శర్మపై చాహల్
author img

By

Published : Feb 7, 2022, 3:27 PM IST

Yuzvendra Chahal On Rohit Sharma: ఇటీవల ఫామ్​ కోల్పోయి పేలవ ప్రదర్శన చేసిన భారత స్పిన్నర్​ యుజ్వేందర్​ చాహల్​.. ఆదివారం వెస్టిండీస్​తో జరిగిన వన్డే మ్యాచ్​తో 4వికెట్లు తీసి మళ్లీ ఫామ్​లోకి వచ్చినట్లు కనిపిస్తున్నాడు. ఆ మ్యాచ్​ అనంతరం మాట్లాడిన చాహల్​.. దక్షిణాఫ్రికా పర్యటన నుంచి తాను చేసిన తప్పులను సరి చేసుకుంటున్నాని తెలిపాడు. ఎక్కువ గూగ్లీలు వేయాల్సిన ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నట్లు చాహల్ చెప్పాడు.

ఇందులో కెప్టెన్​ రోహిత్​ శర్మ పాత్ర ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రాక్టీస్​ సమయంలో రోహిత్​ ఇచ్చిన సలహాలు వెస్టిండీస్​తో మ్యాచ్​లో తన బౌలింగ్​ శైలీలో చిన్నచిన్న మార్పులు చేసినట్లు వెల్లడించాడు.

"నెట్​ ప్రాక్టీస్​ చేస్తున్న సమయంలో ఎక్కువ గూగ్లీ వేస్తే నా బౌలింగ్​ ప్రభావంతంగా ఉంటుందని రోహిత్​ చెప్పాడు. వెస్టిండీస్​ మ్యాచ్​లో అదే చేశాను. విండీస్​ బ్యాట్స్​మన్​ కీరన్​ పొలార్డ్​ బ్యాటింగ్​ వచ్చినప్పుడు తాము ప్లాన్​ చేసినట్లు ఫుల్​ లెంగ్త్​ బంతి విసరమని చెప్పారు. లెంగ్త్​ సరిగా లేకుంటే 80 శాతం సిక్సర్ కొట్టే అవకాశాలు ఉన్నాయని నాకు తెలుసు" అంటూ చాహల్​ తెలిపాడు.

'నువ్వు కీలకమైన ప్లేయర్​'

తాను భారత్​ జట్టుకు కీలకమైన ఆటగాడనని.. మైదానంలోకి అడుగుపెట్టినప్పుడల్లా రోహిత్​ తనతో చెబుతుంటాడని చాహల్​ గుర్తు చేశాడు.

"నువ్వు చాలా కీలకమైన ఆటగాడివి. అదే మనస్తత్వంతో ఆడాలని నేను నీకు చెబుతాను. హెచ్చు తగ్గులు ఉంటాయి.. కానీ సరైన ఆత్మవిశ్వాసంతో ఆడటం చాలా కీలకం" అని రోహిత్​ చెప్పిటన్లు చాహల్​ పేర్కొన్నాడు.

విండీస్​ తొలివన్డేలో భాగంగా 20వ ఓవర్​లో రంగంలోకి దిగిన చాహల్​.. 4 వికెట్లు పడగొట్టి.. 1000వ వన్డేలో భారత్​ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఇవీ చూడండి: IND vs WI: 'గేమ్​లో టాస్​ కీలక పాత్ర పోషించింది'

Rohit sharma: 'డీఆర్​ఎస్'​కు రోహిత్ పేరు పెట్టిన గావస్కర్

యువ క్రికెటర్​పై రోహిత్ కోపం.. ఏమైందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.