Yuzvendra Chahal Australia Series 2023 : ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన తుది జట్టులో యుజ్వేంద్ర చాహల్‌కు అవకాశం దక్కలేదు. అయితే ఆసియా కప్‌లో గాయపడిన అక్షర్ పటేల్ స్థానంలో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఎంపిక చేసుకుంది. ఈ క్రమంలో చాహల్‌ను ఎంపిక చేసుకోకపోవడం పట్ల టీమ్ఇండియా మాజీ ప్లేయర్ హర్బజన్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. చాహల్‌ను ఎందుకు ఎంపిక చేయలదన్న విషయం తనకు అర్థం కావడం లేదని, జట్టులో ఉండదగిన ఆటగాళ్లలో అతడొకడంటూ వ్యాఖ్యానించాడు.
-
Coming 🆙 next 👉 #INDvAUS
— BCCI (@BCCI) September 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Here are the #TeamIndia squads for the IDFC First Bank three-match ODI series against Australia 🙌 pic.twitter.com/Jl7bLEz2tK
">Coming 🆙 next 👉 #INDvAUS
— BCCI (@BCCI) September 18, 2023
Here are the #TeamIndia squads for the IDFC First Bank three-match ODI series against Australia 🙌 pic.twitter.com/Jl7bLEz2tKComing 🆙 next 👉 #INDvAUS
— BCCI (@BCCI) September 18, 2023
Here are the #TeamIndia squads for the IDFC First Bank three-match ODI series against Australia 🙌 pic.twitter.com/Jl7bLEz2tK
"చాహల్ ఇప్పటి జట్టులో ఉంటే బాగుండేది. అతడికి అవకాశాలు మాత్రం ఇవ్వడం లేదు. ఎందుకో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎవరితోనైనా గొడవ పడ్డాడేమో లేదా ఎవరితోనైనా ఏమైనా చెప్పాడా..? అనేది కూడా తెలియడం లేదు. కేవలం మనం నైపుణ్యాల గురించి మాట్లాడుకుంటే మాత్రం జట్టులో ఉండాల్సిన ఆటగాడు. కనీసం ఆసీస్‌తో వన్డే సిరీస్‌లోకైనా చాహల్‌ను తీసుకుంటే బాగుండేది. చాలా మంది ప్లేయర్లు రెస్ట్ తీసుకుంటున్నారు. ఆసియా కప్‌లో విజయాలను అలవాటు చేసుకున్న భారత్ తప్పకుండా ఆసీస్‌ను ఓడిస్తుందనే నమ్మకం నాకు ఉంది. అయితే, తొలి రెండు మ్యాచ్‌ల కోసం ప్రకటించిన జట్టు కాస్త బలహీనంగా ఉన్నట్లు అనిపిస్తోంది. అయినా సరే స్వదేశంలో కాబట్టి అత్యుత్తమ ఆట తీరును ప్రదర్శించాలని మిగతా ఆటగాళ్లు కూడా భావిస్తారు. ఈ క్రమంలో వారు తప్పకుండా విజేతగా నిలుస్తారు. ఆసీస్‌ను ఓడించాలంటే చాలా కష్టపడాలి. లోయర్ ఆర్డర్ వరకూ వారికి బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. అయితే, ఇటీవల సౌతాఫ్రికా సిరీస్‌ను ఓడిపోయినా సరే ఆసీస్ బలమైనదే. ఎనిమిదో స్థానం వరకూ భారీగా హిట్టింగ్ చేసే బ్యాటర్లు ఆ జట్టులో ఉన్నారు" అని హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించాడు.
Yuzvendra Chahal Asia Cup 2023 : తాజాగా జరిగిన ఆసియా కప్ టోర్నమెంట్లో స్టాండ్‌బై ఆటగాడితో పాటు మొత్తం 18 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. చాలా కాలం నుంచి నిలకడగా రాణిస్తున్న యుజ్వేంద్ర చాహల్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. అయితే జట్టు ప్రకటన ఈ సందర్భంగా.. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ మీడియాతో మాట్లాడారు. జట్టు కూర్పుపై ఈ ప్రెస్మీట్లో వివరణ ఇచ్చారు.
టీమ్ఇండియా జట్టులో గత కొద్ది కాలంగా అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న చాహల్‌ను.. దురదృష్టవశాత్తు వదులుకోవాల్సి వచ్చిందని ఆగార్కర్ అన్నాడు. కానీ ఇప్పుడున్న జట్టులో అతడి కంటే కుల్దీప్ యాదవ్ మెరుగ్గా ఆడుతున్నాడని ఆయన తెలిపాడు. ఇక ఇద్దరు రిస్ట్ స్పిన్నర్లను ఎంపిక చేసే పరిస్థితి ప్రస్తుతం లేదని.. అందుకే అక్షర్ పటేల్‌ను తీసుకున్నట్లు ఆగార్కర్ పేర్కొన్నాడు. అయితే రానున్న ప్రపంచకప్‌కు దాదాపు ఇదే జట్టును ఎంపిక చేయవచ్చన్న కథనాలు వస్తున్న వేళ.. చాహల్‌కు ఇంకా అవకాశాలు ఉన్నాయని రోహిత్ స్పష్టం చేశాడు.