ETV Bharat / sports

తండ్రయిన భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ - యువరాజ్ సింగ్ టీమ్​ఇండియా

Yuvraj singh baby: మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రయ్యాడు. ఈ విషయాన్ని మంగళవారం రాత్రి వెల్లడించాడు. భారత జట్టుకు దాదాపు 19 ఏళ్ల పాటు ఇతడు ఆడాడు.

Yuvraj Singh first child
యువరాజ్ సింగ్
author img

By

Published : Jan 26, 2022, 6:47 AM IST

Updated : Jan 26, 2022, 11:42 AM IST

Yuvraj singh children: టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్‌ సింగ్‌-హేజల్‌ కీచ్‌ దంపతులు తమ అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పారు. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు వారు సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు.

"మాకు పండంటి మగబిడ్డ జన్మించాడు. అభిమానులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ విషయాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. దేవుడికి కృతజ్ఞతలు. ఈ సందర్భంగా మా గోప్యతకు ఎలాంటి భంగం కలిగించకూడదని కోరుకుంటున్నాం" అని యువరాజ్‌ ట్వీట్‌ చేశారు. ఇదే పోస్టును హెజల్‌ కీచ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

బ్రిటిష్‌-మారిషియస్‌ నటి, మోడల్‌ అయిన హేజల్‌ కీచ్‌ను 2016లో యువరాజ్‌ సింగ్‌ వివాహమాడారు. ఇటీవలే వీరు తమ ఐదో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకొన్నారు.

2000లో కెన్యాతో మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన యువరాజ్‌.. అనతికాలంలో స్టార్‌ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో సత్తాచాటి ఆలౌరౌండర్‌గా ఎదిగాడు. భారత్‌ తరఫున యువీ 304 వన్డేలు, 40 టెస్టులు, 58 టీ20లు ఆడాడు.

భారత్‌ సాధించిన రెండు ప్రపంచకప్‌లు 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌లో సభ్యుడిగా ఉన్నాడు. 2019 జూన్‌ 10న అన్ని ఫార్మాట్ల నుంచి వైదులుగొతున్నట్లు ప్రకటించాడు. దాదాపు యువీ 19 ఏళ్లపాటు భారత జట్టుకు సేవలందించాడు.

Yuvraj Singh, Hazel Keech
భార్యతో యువరాజ్ సింగ్

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చదవండి:

Last Updated : Jan 26, 2022, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.