ETV Bharat / sports

యోయో టెస్టుపై కీలక నిర్ణయం.. వారందరికీ ఊరట!

YOYO TEST BCCI: టీమ్ఇండియా జట్టు సెలెక్షన్‌ కోసం ఆటగాళ్లకు నిర్వహించే యోయో టెస్టుపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఫిట్​నెస్ పరీక్షను కఠినతరం చేయకూడదని నిర్ణయించినట్లు సమాచారం. ఆటగాళ్లకు మానసిక ప్రశాంతత అందించేందుకు కొత్త నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ అధికారి వెల్లడించారు.

YOYO TEST BCCI
YOYO TEST BCCI
author img

By

Published : Mar 26, 2022, 10:11 AM IST

YOYO TEST BCCI: భారత క్రికెటర్లకు ఇకపై కాస్త ఊరట లభించే అవకాశం ఉంది. జట్టు సెలెక్షన్‌ కోసం ఆటగాళ్లకు నిర్వహించే యోయో టెస్టును కఠినతరం చేయకూడదని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏదైనా సిరీస్‌ లేదా టోర్నీ కోసం ఆటగాళ్లను ఎంపికచేసేముందు కచ్చితంగా వారికి యోయో టెస్టును నిర్వహిస్తారు. అయితే, ఇటీవల చాలా మంది ఆటగాళ్లు ఆ టెస్టులో విఫలమవుతూ జట్టుకు దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి మానసిక ప్రశాంతత అందించేందుకు కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తాజాగా ఓ బీసీసీఐ అధికారి వెల్లడించారు.

Indian Cricket fitness Test: మెగా టీ20 లీగ్‌కు ముందు ఎవరైనా ఆటగాళ్లు యోయో టెస్టులో విఫలమైతే వారిని ఆడించేది లేదని బీసీసీఐ ఇటీవలే స్పష్టం చేసింది. అయితే, పలువురు ఆటగాళ్లు ఆ టెస్టులో విఫలమవడం వల్ల యోయో టెస్టును కఠినతరం చేయకూడదని నిర్ణయించినట్లు చెప్పారు. అది ఆటగాళ్లకు మంచిది కాదని, మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తుందని ఆయన అన్నారు. ఆటగాళ్లు ఈ మధ్య కాలంలో విపరీతమైన క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడుతున్నారని, దీంతో వారిని అనవసరంగా ఒత్తిడికి గురి చేయడం మంచిదికాదని భావించామని ఆయన వివరించారు. 'కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆటగాళ్లు ఇప్పటికే దీర్ఘకాలంగా బయోబబుల్‌లో ఉంటున్నారు. దీంతో మానసికంగా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు' అని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి: IPL 2022: కొత్తగా ఐపీఎలొచ్చెనే.. నేటి నుంచే 15వ సీజన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.