ETV Bharat / sports

గొప్పలు చెప్పొద్దు.. రవిశాస్త్రికి గంభీర్ చురకలు - team india victory

విదేశాల్లో టీమ్ఇండియా అద్భుత విజయాలపై(team india victory) కోచ్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయని తెలిపాడు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్(gambhir fire on ravisastri). ప్రస్తుతం కోచ్​గా ఉన్న ద్రవిడ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తాడనుకోవడం లేదని పేర్కొన్నాడు.

gambhir
గంభీర్​
author img

By

Published : Nov 22, 2021, 3:41 PM IST

విదేశాల్లో టీమ్‌ఇండియా గొప్ప విజయాలు సాధించాక మాజీ కోచ్‌ రవిశాస్త్రి(ravi shastri best indian team) చేసిన వ్యాఖ్యలు తనకు ఆశ్చర్యం కలిగించాయని మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు(gambhir fire on ravisastri). తాజాగా అతడు ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. శాస్త్రి కోచింగ్‌పై స్పందిస్తూ ఇలా చెప్పుకొచ్చాడు.

"ఎవరైనా బాగా ఆడేటప్పుడు గొప్పలు చెప్పుకోరు. ఆ విజయాల గురించి ఇతరులు మాట్లాడుకుంటే పర్వాలేదు. కానీ, నీ గురించి నువ్వే చెప్పుకొంటే బాగోదు. మేం 2011లో వన్డే ప్రపంచకప్‌ గెలిచినప్పుడు.. మాలో ఎవ్వరూ మేం అత్యుత్తమ జట్టు అనే వ్యాఖ్యలు చేయలేదు. అది దేశ ప్రజలకే వదిలేశాం. మనం విజయాలు సాధిస్తే అది ఇతరులు మాట్లాడుకునేలా ఉండాలి. టీమ్‌ఇండియా.. ఆస్ట్రేలియాలో విజయాలు సాధించడం గొప్ప విశేషం. అది ఏమాత్రం తక్కువ కాదు. అలాగే ఇంగ్లాండ్‌లోనూ రాణించింది. వాటి గురించి వేరేవాళ్లు మనల్ని కీర్తించాలి. ఇప్పుడు కొత్తగా బాధ్యతలు తీసుకున్న రాహుల్‌ ద్రవిడ్‌(dravid coach news) ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడనుకుంటున్నా. టీమ్‌ఇండియా గెలిచినా ఓడినా ఆయన స్పందన స్థిరంగా ఉంటుందని ఆశిస్తున్నా. ద్రవిడ్‌ తొలి ప్రాధాన్యం ఆటగాళ్ల ప్రవర్తన బాగుండాలని చూస్తాడు" అని గంభీర్‌ అభిప్రాయపడ్డాడు.

కాగా, 2018-2019 సీజన్‌లో టీమ్‌ఇండియా ఆస్ట్రేలియాలో తొలిసారి బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌(team india win against australia) గెలిచిన అనంతరం రవిశాస్త్రి స్పందిస్తూ.. ఇదో అతిపెద్ద విజయం అని, అది 1983 ప్రపంచకప్‌ కన్నా గొప్ప విశేషమని కొనియాడాడు. ఈ నేపథ్యంలోనే గంభీర్‌ స్పందించాడు. కాగా, ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌తో రవిశాస్త్రి కోచింగ్‌ బాధ్యతలు పూర్తయ్యాయి. ఆ స్థానాన్ని రాహుల్‌ ద్రవిడ్‌ భర్తీ చేశాడు.

ఇవీ చూడండి: కోర్నికోవా.. అందంతో కవ్వించే టెన్నిస్ భామ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.