సోషల్ మీడియా, ఇంటర్నెట్.. విస్తృతంగా అందుబాటులోకి వచ్చాక ఒక జాఢ్యం పెరిగిపోయింది! మంచేదో, చెడేదో ఆలోచించకుండా.. యుక్తాయుక్త విచక్షణ లేకుండా ప్రతి దానికీ ట్రోలింగ్ చేసేస్తున్నారు. టీమ్‌ఇండియా క్రికెటర్ హనుమ విహారి తనపై చేసే ట్రోలింగ్‌కు చాలాదూరం ఉంటాడు. కానీ తాజాగా ఓ వ్యక్తి చేసిన విమర్శకు సూటిగా దిమ్మదిరిగే సమాధానం ఇచ్చాడు.
ప్రస్తుతం హనుమ విహారి ఇంగ్లాండ్‌లో ఉన్నాడు. కౌంటీ క్రికెట్ ఆడుతున్నాడు. అయితే భారత్‌లో కరోనాకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడు. ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకొనేందుకు సోషల్ మీడియా వేదికగా విరాళాల సేకరణ చేపట్టాడు.
హనుమ విహారి చేస్తున్న పనిని ప్రశంసించకుండా ఒక వ్యక్తి వెటకారం ప్రదర్శించాడు. "సరే భాయ్, రెండు మసాలా దోసెలు తీసుకురండి. అలాగే కొబ్బరి పచ్చడి మర్చిపోవద్దు" అంటూ కామెంట్ పెట్టాడు. సహజంగా ఈ తెలుగు క్రికెటర్ ఇలాంటి వాటికి దూరంగా ఉంటాడు. కానీ ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా అతడికి గట్టి జవాబు ఇవ్వాలనుకున్నాడు.
-
I would if you’re suffering like many people in India are right now. Oh, wait a minute you’re actually suffering from a different disease. I’m sorry! 🙂 https://t.co/rLaOQDa7v3
— Hanuma vihari (@Hanumavihari) May 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">I would if you’re suffering like many people in India are right now. Oh, wait a minute you’re actually suffering from a different disease. I’m sorry! 🙂 https://t.co/rLaOQDa7v3
— Hanuma vihari (@Hanumavihari) May 9, 2021I would if you’re suffering like many people in India are right now. Oh, wait a minute you’re actually suffering from a different disease. I’m sorry! 🙂 https://t.co/rLaOQDa7v3
— Hanuma vihari (@Hanumavihari) May 9, 2021
"భారతదేశంలోని చాలామంది లాగే నువ్వూ బాధపడుతుంటే నేను కచ్చితంగా ఇచ్చేవాడినే. ఓహ్, ఒక్క నిమిషం. కానీ నిజానికి నువ్వు మరో రోగంతో బాధపడుతున్నావు. ఐయామ్ సారీ!" అని విహారి బదులిచ్చాడు.
ఇదీ చదవండి: ఈ నలుగురు.. టీ20 ప్రపంచకప్‌లో ఆడతారా?