సౌథాంప్టన్ వేదికగా కివీస్-భారత్ మధ్య జరుగుతోన్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఐదో రోజు కూడా ఆలస్యంగా ప్రారంభమైంది. వర్షం కారణంగా ఔట్‌ఫీల్డ్ తడిగా మారడం వల్ల మ్యాచ్ నిర్ణీత సమయానికంటే గంట ఆలస్యంగా ప్రారంభమైంది.
ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. క్రీజులో రాస్ టేలర్, కెప్టెన్ విలియమ్సన్ ఉన్నారు. భారత బౌలర్లలో ఇషాంత్, అశ్విన్ తలో వికెట్ తీసుకున్నారు.
ఆట ఐదో రోజు చేరినప్పటికీ.. వర్షం అంతరాయం కారణంగా ఇరుజట్ల తొలి ఇన్నింగ్స్‌లు కూడా పూర్తి కాలేదు. దీంతో ఈ మ్యాచ్‌లో రిజర్వ్ డేను వాడుకున్నా ఫలితం వచ్చేది కష్టమే అని చెప్పాలి. ఇక భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ సూచించినట్లు.. విజేతను తేల్చడానికి ఐసీసీ ఒక సూత్రం కనుగొనాలేమో!
ఇదీ చదవండి: రెండు పరుగులకు ఆలౌటవడం ఏందయ్యా!