ETV Bharat / sports

WTC Final: నాలుగో రోజూ వరుణుడిదే

వర్షం కారణంగా భారత్-కివీస్​ మధ్య జరుగుతోన్న డబ్ల్యూటీసీ ఫైనల్​ మ్యాచ్​లో నాలుగో రోజు ఆట నిలిచిపోయింది. కనీసం ఒక్క బంతి పడకుండానే ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

wtc final, india vs newzealand
డబ్ల్యూటీసీ ఫైనల్, ఇండియా vs న్యూజిలాండ్
author img

By

Published : Jun 21, 2021, 7:39 PM IST

Updated : Jun 21, 2021, 8:58 PM IST

ప్రపంచ టెస్ట్​ ఛాంపియన్​షిప్​ ఫైనల్​ మ్యాచ్​లో వర్షం కారణంగా నాలుగో రోజు ఆట తుడిచిపెట్టుకుపోయింది. ఒక్క బంతి పడకుండానే ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.

వెలుతురులేమి కారణంగా మూడో రోజు ఆట తొందరగా ముగిసే సమయానికి న్యూజిలాండ్​ రెండు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. రాస్ టేలర్, విలియమ్సన్​ క్రీజులో ఉన్నారు. టీమ్​ఇండియా బౌలర్లు ఇషాంత్​, ఆశ్విన్​ చెరో వికెట్ తీశారు. అంతకుముందు తొలి రోజు కూడా ఆట వర్షార్పణమైపోయింది. రెండో రోజు ప్రారంభం కాగా. టాస్​ ఓడి బ్యాంటింగ్​ కు దిగిన కోహ్లీసేన.. మొత్తం మీద 217 పరుగులకు ఆలౌట్​ అయ్యింది.

WTC Final day 4
ఇదీ పరిస్థితి

మరో ఒక్క రోజు ఆట మాత్రమే నిలిచి ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్​లో ఫలితం వచ్చేది అనుమానంగానే మారింది. ఆరో రోజైనా రిజర్వ్ డేను ఉపయోగించుకున్నా విజేత ఎవరో తేలడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.

WTC Final day 4
టేబుల్​ టెన్నిస్​తో కాలక్షేపం
WTC Final day 4
గ్రౌండ్​ అంతా నీరే- టామ్​ లాథన్​

మరోవైపు సామాజిక మాధ్యమాల వేదికగా క్రికెట్​ అభిమానులు, నెటిజెన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లాండ్​ వాతావరణ పరిస్థితులు, ఐసీసీపై మీమ్స్​, ట్రోల్స్​ చేస్తున్నారు.

ఇదీ చదవండి: 'ఫైనల్ మ్యాచ్​లు ఇంగ్లాండ్​లో పెట్టొద్దు బాబోయ్​'

Last Updated : Jun 21, 2021, 8:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.