ETV Bharat / sports

WTC Final: మెరిసిన కాన్వే.. పట్టు బిగిస్తోన్న కివీస్ - డబ్ల్యూటీసీ ఫైనల్ స్కోర్లు

ఇంగ్లాండ్ వేదికగా భారత్​తో జరుగుతోన్న మ్యాచ్​లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్​ 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. కాన్వే అర్ధ శతకంతో రాణించాడు. క్రీజులో కెప్టెన్ విలియమ్సన్(12*), రాస్ టేలర్ (0*) ఉన్నారు.

wtc final, india vs newzealand
డబ్ల్యూటీసీ ఫైనల్, ఇండియా vs న్యూజిలాండ్
author img

By

Published : Jun 20, 2021, 11:22 PM IST

Updated : Jun 20, 2021, 11:53 PM IST

సౌథాంప్టన్ వేదికగా టీమ్ఇండియాతో జరుగుతోన్న డబ్ల్యూటీసీ ఫైనల్​ మ్యాచ్​లో న్యూజిలాండ్​ పట్టు బిగిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. కాన్వే(54) అర్ధ శతకంతో రాణించాడు. ప్రస్తుతం క్రీజులో.. కెప్టెన్ విలియమ్సన్​(12*), రాస్ టేలర్ (0*) ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్​, ఇషాంత్ చెరో వికెట్ తీశారు.

తొలి ఇన్నింగ్స్​లో బరిలోకి దిగిన కేన్​ సేనకు శుభారంభం లభించింది. తొలి వికెట్​కు ఓపెనర్లు లాథమ్​-కాన్వే జోడీ 70 పరుగులు జోడించింది. ఓ వైపు భారత పేసర్లు కట్టుదిట్టమైన బంతులేస్తున్నా ఈ ద్వయం ఓపికతో బ్యాటింగ్ చేసింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను అశ్విన్​ విడగొట్టాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ పట్టిన ఓ అద్భుతమైన క్యాచ్​కు లాథమ్​ పెవిలియన్​ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విలియమ్సన్​.. నిలకడగా ఆడి కాన్వేకు సహకారం అందించాడు. ఈ క్రమంలో అర్థ శతకం పూర్తి చేసుకొని ఆత్మవిశ్వాసంగా కనపడిన కాన్వే.. 49వ ఓవర్లో ఇషాంత్ బౌలింగ్​లో ఔట్ అయ్యాడు. దాంతో న్యూజిలాండ్ 101 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. అదే సమయంలో వెలుతురులేమి కారణంగా అంపైర్లు ఆటను నిలిపివేశారు. క్రీజులో కేన్, టేలర్ ఉన్నారు. వర్షం కారణంగా తొలి రోజు తుడిచిపెట్టుకుపోయిన మ్యాచ్​.. రెండో రోజూ వెలుతురులేమీ కారణంగా​ పలుమార్లు ఆగిపోయింది.

భారత్​ టపటపా..

146/3తో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమ్ఇండియా.. కాసేపటికే కెప్టెన్​ కోహ్లీ వికెట్​ను కోల్పోయింది. అద్భుతమైన బంతితో జేమీసన్.. విరాట్​ను​ ఎల్బీగా పెవిలియన్​ చేర్చాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన రిషభ్​ పంత్​ కూడా ఆకట్టుకోలేకపోయాడు. 22 బంతులాడి కేవలం 4 పరుగులే చేసిన పంత్​ అనవసరమైన షాట్​ ఆడి జేమీసన్​ బౌలింగ్​లో ఔట్​ అయ్యాడు. మరో బ్యాట్స్​మన్​ అజింక్య రహానె.. సంయమనం ప్రదర్శించాడు. అర్ధ సెంచరీకి చేరువైన అతడిని వాగ్నర్​ బోల్తా కొట్టించాడు. అనంతరం బ్యాటింగ్​కు దిగిన అశ్విన్​(27 బంతుల్లో 22 పరుగులు) ధాటిగా ఆడే ప్రయత్నం చేసి చివరికి స్లిప్స్​లో దొరికిపోయాడు.

లంచ్ అనంతరం భారత్​ 6 పరుగుల తేడాతో 3 వికెట్లను కోల్పోయింది. వరుస బంతుల్లో జేమీసన్..​ ఇషాంత్​, బుమ్రా వికెట్లను తీసుకున్నాడు. ఇషాంత్​ను కీపర్​ క్యాచ్​గా వెనక్కి పంపగా.. బుమ్రాను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్​ ఈవెంట్​లో 5 వికెట్లు తీసిన తొలి బౌలర్​గా జేమీసన్​ రికార్డు సృష్టించాడు. తర్వాత బౌల్ట్​ బౌలింగ్​లో జడేజా ఔటయ్యాడు.

ఇదీ చదవండి: Tokyo Olympics: అథ్లెట్లకు బీసీసీఐ విరాళం.. ఎంతంటే?

Last Updated : Jun 20, 2021, 11:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.