AUS vs IND WTC Final: టీమ్‌ఇండియా వరుసగా రెండోసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరింది. తొలి డబ్ల్యూటీసీలో జరిగిన ఫైనల్స్‌లో న్యూజిలాండ్ విజయం సాధించగా.. ఈ సారైనా భారత్ విజేతగా నిలవాలంటూ అభిమానులు ఆశిస్తున్నారు. అయితే, ప్రత్యర్థి ఆస్ట్రేలియాను అంత తక్కువగా అంచనా వేయలేం. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పాటు దూకుడుగా ఆడే బ్యాటర్లు.. పేస్ ఎటాక్‌తో కూడిన బౌలర్లు ఇలా ఎన్నో బలాలు ఆ జట్టు సొంతం. మరి ఇలాంటి పరిస్థితుల్లో జరగనున్న తుది పోరులో ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు ఎవరున్నారో ఓసారి చూద్దామా..
విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, ఛెతేశ్వర్ పుజారా.. వీరందరూ టీమ్‌ఇండియా టాప్ ఆర్డర్ బ్యాటర్ల లిస్ట్‌లో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌తో సంబంధం లేని ఆటగాడు. తనదైన రోజున ఎలా ఉన్నా మైదానంలో చెలరేగిపోతాడు. ఇక ఐపీఎల్‌లో సెంచరీలతో అదరగొట్టిన శుభ్‌మన్ గిల్.. అదే ఫామ్‌ను కొనసాగిస్తూ.. ఇంగ్లాండ్‌కు చేరాడు. అయితే, ఆసీస్ ఆటగాళ్లను ఎంతగానో కలవరపెడుతున్నారు విరాట్-ఛెతేశ్వర్ ద్వయం. వీరిద్దరి ఆటకు ఆసిస్ జట్టు ఏ మేరకు భయపడుతోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరికి ఆసీస్‌పై ఉన్న రికార్డే దానికి కారణం.
WTC Final Team India : పుజారా కౌంటీల్లో ఆడిన అనుభవం ఈ డబ్ల్యూటీసీకి అక్కరకొస్తుంది. అలాగే డబ్ల్యూటీసీ సైకిల్లో (2021-23) భారత్ తరపున బ్యాటింగ్ చేసిన వారిలో ఉత్తమ ప్రదర్శన చేసిన తొలి ఇద్దరు ఆటగాళ్లు కూడా పుజారా (887 పరుగులు), కోహ్లీ (869)నే. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు క్రీజ్‌లో పాతుకుపోయినా.. భారత్‌కు భారీ స్కోరు రావడం అనేది ఖాయం ఇక. చాన్నాళ్ల తర్వాత టీమ్ఇండియాలోకి అడుగు పెట్టిన అజింక్య రహానె.. ఈ మ్యాచ్‌ల్లో ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు కీపర్ విషయంలోనూ సందిగ్ధత నెలకొంది. ఇషాన్, కేఎస్ భరత్.. ఈ ఇద్దరిలో ఎవరిని తీసుకోవాలనేది మేనేజ్‌మెంట్‌కు పెద్ద సమస్యగా మారిన అంశం.
WTC Final Team Australia : మరోవైపు టెస్టు ఫార్మాట్‌లో ఆడనున్న ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.. గత కొంతకాలంగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు. ఐపీఎల్‌లో దూకుడుగా ఆడకపోయినప్పటీకీ.. తన ఫామ్ తిరిగివచ్చేలా ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే అతడి ఓపెనింగ్ పార్టనర్ ఉస్మాన్ ఖవాజా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇక జట్టులో ఉన్న స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ ఉండనే ఉన్నారు. పేస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ ఈ సారి తమ జట్టుకు కీలక ఆటగాడిగా మారతాడని ఆసీస్ శిబిరం భావిస్తోంది. ఇక ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్‌ను త్వరగా ఔట్ చేయగలిగితే.. మ్యాచ్‌పై భారత్ పట్టు సాధించే అవకాశాలు చాలా ఉంటాయి.
-
Hello 👋 from the Oval.#WTC23 #TeamIndia pic.twitter.com/FsDL6tm2aI
— BCCI (@BCCI) June 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Hello 👋 from the Oval.#WTC23 #TeamIndia pic.twitter.com/FsDL6tm2aI
— BCCI (@BCCI) June 4, 2023Hello 👋 from the Oval.#WTC23 #TeamIndia pic.twitter.com/FsDL6tm2aI
— BCCI (@BCCI) June 4, 2023
ఇంగ్లాండ్ పిచ్‌లు అంటేనే ఫాస్ట్ బౌలింగ్‌కు స్వర్గధామం అని అంటారు. ఓవల్ పిచ్ పరిస్థితి కూడా అదే. కానీ, మ్యాచ్ జరుగుతున్న కొద్దీ స్పిన్‌కూ సహకరిస్తుందని క్రికెట్ విశ్లేషకుల అంచనా. ఇక భారత్ తమ జట్టులో ముగ్గురు స్పిన్నర్లతో ఇంగ్లాండ్‌లో అడుగు పెట్టింది. అయితే, తుది జట్టులో మాత్రం ఎంతమందికి అవకాశం దక్కుతుందన్న విషయం తెలియాల్సి ఉంది. పేస్ బౌలింగ్‌లో బుమ్రా లేకపోయినా కూడా జట్టు బలంగానే ఉంది. ఇక షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయ్‌దేవ్ ఉనద్కత్‌తోపాటు ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ కూడా ఈ సారి జట్టులో ఉన్నాడు. కానీ ముగ్గురికే అవకాశం ఉండొచ్చు. షమీ, సిరాజ్‌తోపాటు మూడో పేసర్‌గా ఆల్‌రౌండర్ ఠాకూర్ వైపు మొగ్గు చూపినా ఆశ్చర్యపడక్కర్లేదు. నాలుగో పేసర్‌గా అయితే, జయదేవ్‌ను తీసుకోవాలి. టీమ్‌లో ఓ లెఫ్ట్‌ఆర్మ్ పేసర్ ఉండటం బెటర్.
ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వాస్తవానికి ఓ పేసర్. ఇక ఓవల్ మైదానం పరిస్థితి..ఆసీస్ పిచ్‌లకు కాస్త దగ్గరగానే ఉంటుంది. దీంతో అతడితోపాటు హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్ పేస్ భారాన్ని మోస్తారు. ఒకవేళ హేజిల్‌వుడ్ ఫిట్‌నెస్ సాధించకపోతే.. స్కాట్ బొలాండ్‌కు ఆ అవకాశం రావడం తథ్యం. పేస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ ఉండటం ఆసీస్‌కు అదనపు బలం చేకూరుస్తంది. మరోవైపు టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ గణాంకాలు కలిగిన నాథన్ లైయన్ తుది జట్టులో ఉంటాడు. రెండో స్పిన్నర్‌తో బరిలోకి దిగే అవకాశాలు చాలా తక్కువ. మరీ ముఖ్యమని అనుకుంటే లబుషేన్ బౌలింగ్ వేయగలడు.
-
Tune up in Beckenham ahead of the #WTCFinal 🔥
— cricket.com.au (@cricketcomau) June 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
📷: @ICC / Getty #WTC23 pic.twitter.com/otyb7Qjgaa
">Tune up in Beckenham ahead of the #WTCFinal 🔥
— cricket.com.au (@cricketcomau) June 2, 2023
📷: @ICC / Getty #WTC23 pic.twitter.com/otyb7QjgaaTune up in Beckenham ahead of the #WTCFinal 🔥
— cricket.com.au (@cricketcomau) June 2, 2023
📷: @ICC / Getty #WTC23 pic.twitter.com/otyb7Qjgaa
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఛెతేశ్వర్ పుజారా, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింక్య రహానె, జడేజా, షమీ, సిరాజ్, అశ్విన్, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్).
ఆస్ట్రేలియా: ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), జోష్ హేజిల్‌వుడ్ /స్కాట్ బొలాండ్, మిచెల్ స్టార్క్, నాథన్ లైయన్