ETV Bharat / sports

WTC Final: 'మాది బెస్ట్ టీమ్​.. మరో 30-40 పరుగులు చేయాల్సింది'

ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్​షిప్ ఫైనల్​లో న్యూజిలాండ్ గెలిచింది. టీమ్​ఇండియా చివరి మెట్టుపై బోల్తా కొట్టింది. అయితే మ్యాచ్​ అనంతరం మాట్లాడిన ఇరుజట్లు కెప్టెన్ కోహ్లీ, విలియమ్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

kohli, williamson comment on WTC Final
కోహ్లీ విలియమ్సన్
author img

By

Published : Jun 24, 2021, 9:11 AM IST

టీమ్​ఇండియా టెస్టు జట్టులోకి మ్యాచ్​ విన్నర్లను తీసుకొస్తానని కెప్టెన్ విరాట్ కోహ్లీ సూచించాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్​షిప్​లో అత్యుత్తమ జట్టుతోనే ఆడామని, అనుకున్న దాని కంటే 30-40 పరుగులు తక్కువ చేయడం వల్ల న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయినట్లు పేర్కొన్నాడు. బుధవారం పూర్తయిన ఫైనల్​లో ఓటమి అనంతరం విరాట్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

న్యూజిలాండ్ జట్టు అద్భుతంగా ఆడిందని కోహ్లీ ప్రశంసించాడు. మ్యాచ్​ ఆసాంతం తమపై ఒత్తిడి తీసుకొచ్చి, విజయం సాధించారని అన్నాడు. ఈ గెలుపునకు వారు అర్హులని స్పష్టం చేశాడు. టెస్టు క్రికెట్, ఆటకు గుండెచప్పుడు లాంటిదని, ఈ టోర్నీ నిర్వహించాలనే ఐసీసీ ఆలోచన మంచిదని కోహ్లీ చెప్పాడు.

వరల్డ్ టెస్టు ఛాంపియన్​ అనేది తమకు ప్రత్యేక విజయమని కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. తమ జట్టులో స్టార్లు లేకపోయినప్పటికీ కలిసికట్టుగా ఆడి గెలిచామని చెప్పాడు. న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో తొలి ఐసీసీ ప్రపంచ టైటిల్ దక్కించుకోవడం గొప్ప అనుభూతి అని విలియమ్సన్ తెలిపాడు.

WTC Final: kohli, williamson comment on WTC Final
న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్

సౌథాంప్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​ వర్షం వల్ల పలు ఇబ్బందులు ఎదుర్కొంది. తొలిరోజు ఆట పూర్తిగా రద్దవగా, మిగతా రోజులతో పాటు రిజర్వ్​డే వరకు సాగింది. తొలి ఇన్నింగ్స్​లో భారత్ 217 పరుగులకు, న్యూజిలాండ్ 249 పరుగులకు ఆలౌట్​ అయ్యాయి. రెండో ఇన్నింగ్స్​లో కోహ్లీసేన 170 రన్స్​ చేయగా, 140/2తో నిలిచి కివీస్​ ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్ టైటిల్​ను సగర్వంగా ముద్దాడింది.

అశ్విన్ రికార్డు

దాదాపు రెండేళ్లపాటు సాగిన ఈ టోర్నీలో టీమ్​ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. మొత్తంగా 71 వికెట్లతో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్​గా నిలిచాడు. ఇతడి తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా బౌలర్ పాట్ కమిన్స్ ఉన్నాడు.

ashwin WTC Final
అశ్విన్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.