సౌథాంప్టన్ వేదికగా టీమ్ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతోన్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు వరుణుడు అడ్డు తగులుతూనే ఉన్నాడు. మూడో రోజు ఆట కూడా ఆలస్యమైంది. సౌథాంప్టన్‌లో వర్షం కురిసింది. ఈ కారణంగా ఔట్‌ఫీల్డ్ తడిగా మారింది. దీంతో మ్యాచ్ సమయానికి ప్రారంభం కాలేదు.
భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30కి మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఇప్పటికే తొలి రోజు ఆట వర్షం వల్ల తుడిచిపెట్టుకుపోయింది. ఇక రెండో రోజు ఆట కూడా వెలుతురులేమీ కారణంగా నిర్ణీత సమయం కంటే ముందుగానే ముగిసింది.