ETV Bharat / sports

'లాలాజలం లేకుండా బంతితో స్వింగ్​ రాబట్టొచ్చు!' - టెస్టు ఛాంపియన్​షిప్​ వార్తలు

లాలాజలం(saliva) వాడకుండానే బంతితో స్వింగ్​ రాబట్టొచ్చని అంటున్నాడు టీమ్ఇండియా పేసర్​ ఇషాంత్​ శర్మ(Ishant Sharma). అలా జరగాలంటే బంతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఒకర్ని నియమించాల్సిన అవసరం ఉందని తెలిపాడు.

Ball will swing even without saliva, says Ishant Sharma
లాలాజలం లేకుండా బంతి స్వింగ్​ చేయడం సాధ్యమే!
author img

By

Published : Jun 15, 2021, 1:44 PM IST

టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​(WTC Final)లో బంతికి లాలాజలం వాడకుండానే స్వింగ్​ రాబట్టొచ్చని అంటున్నాడు టీమ్ఇండియా పేసర్​ ఇషాంత్​ శర్మ(Ishant Sharma). అయితే మ్యాచ్​ జరిగే సమయంలో బంతి పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒకర్ని నియమించాల్సిన అవసరం ఉందని తెలిపాడు.

"బంతికి లాలాజలం(saliva) లేకుండానే స్వింగ్​ అవుతుందని నేను భావిస్తున్నా. అయితే బంతి నిర్వహణ బాధ్యతగా ప్రత్యేకంగా ఒకర్ని నియమించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బంతిని పర్యవేక్షిస్తే.. బౌలర్లు వికెట్లు తీయడం సులభంగా మారుతుంది".

- ఇషాంత్​ శర్మ, టీమ్ఇండియా పేసర్​

"ఇంగ్లాండ్​ పిచ్​లకు తగ్గట్టుగా ఆటగాళ్లు శిక్షణ పొందాల్సిఉంది. ఇండియాలోని మైదానాల్లో అయితే ఆట ప్రారంభమైన కొంత సమయం తర్వాత బంతి స్వింగ్​ అవుతుంది. కానీ, ఇంగ్లాండ్​లోని పరిస్థితులు అలా కాదు.. బంతి స్వింగ్​ అవ్వాలంటే లెన్త్​తో బౌలింగ్ చేయాలి" అని ఇషాంత్​ అన్నాడు.

కరోనా వ్యాప్తి కారణంగా క్రికెట్​లో బంతికి లాలాజలం(saliva) వాడడాన్ని గతేడాది అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ICC) నిషేధించింది. అయితే బంతిని స్వింగ్​ చేసేందుకు బౌలర్లు చెమటను వాడుతున్నారు.

ఇషాంత్​ శర్మ.. టీమ్ఇండియా తరఫున ఇప్పటివరకు 101 టెస్టులకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ సుదీర్ఘ ఫార్మాట్​లో 303 వికెట్లను పడగొట్టాడు.

ఇదీ చూడండి.. WTC Final: కోహ్లీసేనతో తలపడనున్న టీమ్​ ఇదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.