ETV Bharat / sports

'ఆ మ్యాచ్​ నాకు ప్రపంచకప్ ఫైనల్​తో సమానం' - నీల్ వాగ్నర్

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్ ఫైనల్(WTC Final)​ తనకు ప్రపంచకప్​ ఫైనల్​తో సమానమని అభిప్రాయపడ్డాడు కివీస్​ బౌలర్​ నీల్ వాగ్నర్​. పరిమిత ఓవర్ల క్రికెట్​లో ఇంతవరకు న్యూజిలాండ్​కు ప్రాతినిధ్యం వహించని కారణంగా ఈ వ్యాఖ్యలు చేశాడు వాగ్నర్.

Neil Wagner, new zealand cricketer
నీల్ వాగ్నర్, న్యూజిలాండ్ క్రికెటర్
author img

By

Published : May 30, 2021, 3:21 PM IST

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​(WTC Final)పై స్పందించాడు కివీస్​ ఫాస్ట్​ బౌలర్​ నీల్ వాగ్నెర్. ఇంగ్లాండ్ వేదికగా భారత్​తో జరగబోయే డబ్ల్యూటీసీ మ్యాచ్​ తనకు ప్రపంచకప్​ ఫైనల్​ లాంటిదని అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్ తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్​లో​ ప్రాతినిధ్యం వహించని కారణంగా వాగ్నర్​ ఈ తరహా వ్యాఖ్యలు చేశాడు.

"అవును, డబ్ల్యూటీసీ నాకు ప్రపంచకప్​ ఫైనల్​ లాంటిది. ఎందుకంటే నేను టీ20ల్లో గానీ, వన్డేల్లో గానీ న్యూజిలాండ్​కు ప్రాతినిధ్యం వహించలేదు. ఇప్పుడు అలాంటి అవకాశం వచ్చింది. ఇది మళ్లీ రాకపోవచ్చు. నా వరకైతే ఇది ప్రపంచకప్​ ఫైనల్​ లాంటిది."

-నీల్ వాగ్నెర్, న్యూజిలాండ్ క్రికెటర్.

ఈ ఏడాది మార్చిలో టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్​ కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్​ ఆడని చాలా మంది ఆటగాళ్లకు.. డబ్ల్యూటీసీ ఫైనల్​ మ్యాచ్​ ప్రపంచకప్​ లాంటిదని అభిప్రాయపడ్డాడు.

ఇంగ్లాండ్​తో రెండు టెస్టుల సిరీస్ కోసం ఇప్పటికే యూకే చేరుకుంది కివీస్ జట్టు. అనంతరం భారత్​తో జరగబోయే డబ్ల్యూటీసీ మ్యాచ్​ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ఇదీ చదవండి: Sachin: అప్పుడు మిస్.. నాలుగు నెలల తర్వాత 'డబుల్'!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.