WTC Final 2023 : క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు మరో రెండు రోజుల్లో తెరలేవనుంది. జూన్ 7 నుంచి లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో జరగనున్న తుది పోరులో ఆస్ట్రేలియా, భారత జట్లు అమీతుమీ తేల్చుకోవడానికి సిద్దమయ్యాయి. అయితే ఈ ఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది.
WTC Final 2023 Ishan Kishan : భారత జట్టు యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ నెట్స్‌లో గాయపడ్డాడు. ప్రాక్టీస్‌లో భాగంగా నెట్ బౌలర్ అనికిత్ చౌదరీ వేసిన బంతి కిషన్ చేతికి బలంగా తాకింది. దీంతో నొప్పితో విల్లావిల్లాడిన కిషన్ తర్వాతి ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొనలేదు. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో వికెట్ కీపర్‌గా కిషన్, శ్రీకర్ భరత్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.
కొంతమంది భరత్‌కు తుది జట్టులో చోటు ఇవ్వాలని సూచిస్తుంటే.. మరి కొంతమంది కిషన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. అయితే ఇప్పుడు గాయం కారణంగా జట్టు సెలక్షన్‌కు కిషన్ అందుబాటులో లేకపోతే.. భరత్‌కు చోటు ఖాయమైనట్లే. కాగా ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత స్టార్ ఆటగాళ్లు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా గాయల కారంగా దూరమైన సంగతి తెలిసిందే.
-
Lights 💡
— BCCI (@BCCI) June 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Camera 📸
Headshots ✅#TeamIndia | #WTC23 pic.twitter.com/9G34bFfg78
">Lights 💡
— BCCI (@BCCI) June 5, 2023
Camera 📸
Headshots ✅#TeamIndia | #WTC23 pic.twitter.com/9G34bFfg78Lights 💡
— BCCI (@BCCI) June 5, 2023
Camera 📸
Headshots ✅#TeamIndia | #WTC23 pic.twitter.com/9G34bFfg78
ఆ జట్టులో పంత్‌కు చోటు!
WTC Final 2023 Rishabh Pant : మరోవైపు, డబ్ల్యూటీసీ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. గత రెండేళ్లలో బాగా రాణించిన వివిధ దేశాల ఆటగాళ్లతో తమ బెస్ట్ ఎలెవన్‌ను రూపొందించింది. ఈ జట్టులో ముగ్గురు భారత ఆటగాళ్లకు చోటు దక్కింది. అయితే.. బ్యాటింగ్‌లో ఒక్కరికీ అవకాశం దక్కలేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారాలలో ఒక్కరు కూడా ఈ జాబితాలో లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
స్పిన్, ఆల్‌రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లకు చోటు కల్పించింది. రోడ్డు ప్రమాదంలో గాయపడటానికి ముందు టెస్టుల్లో సంచలన బ్యాటింగ్‌తో అలరించిన రిషభ్ పంత్ ను వికెట్ కీపర్‌గా ఎంచుకుంది. 2022 డిసెంబర్ చివరిలో పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో తర్వాత జరిగిన పలు వన్డే, టీ20 సిరీస్‌లతోపాటు బోర్డర్-గావస్కర ట్రోఫీలోనూ పంత్ ఆడలేదు. ప్రస్తుతం కోలుకుంటున్న రిషభ్ ఇటీవల ముగిసిన ఐపీఎల్-16 సీజన్‌కూ దూరంగా ఉన్నాడు.
క్రికెట్ ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌కు పాట్ కమిన్స్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఓపెనర్లుగా ఉన్మాన్ ఖవాజా (ఆసీస్), డిమిత్ కరుణరత్నె (శ్రీలంక)లను తీసుకుంది. బాబర్ అజామ్ (పాకిస్థాన్)కు మూడో స్థానంలో, జో రూట్ (ఇంగ్లాండ్)కు నాలుగో స్థానంలో అవకాశం కల్పించింది. దూకుడైన బ్యాటింగ్‌తో విరుచుకుపడుతున్న ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా)ను ఐదో స్థానంలో తీసుకుంది. ఫాస్ట్ బౌలర్ల కోటాలో పాట్ కమిన్స్ (ఆసీస్), జేమ్స్ అండర్సన్ (ఇంగ్లాండ్), కగిసో రబాడ (సౌతాఫ్రికా)లను తీసుకుంది.
క్రికెట్ ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్
ఉస్మాన్ ఖవాజా, డిమిత్ కరుణరత్నె, బాబర్ అజామ్, జో రూట్, ట్రావిస్ హెడ్, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, పాట్ కమిన్స్, జేమ్స్ అండర్సన్, కగిసో రబాడ.