WTC Final 2023 : టీమ్‌ఇండియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తొలి రోజు ఆసీస్‌దే ఆధిపత్యం. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (146*; 156 బంతుల్లో) సెంచరీ సాధించాడు. స్టీవ్ స్మిత్ (95*) శతకానికి చేరువయ్యాడు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (0) డకౌట్‌గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (43; 60 బంతుల్లో 8 ఫోర్లు) దూకుడుగా ఆడాడు. మార్నస్ లబుషేన్ (26) పరుగులు చేశాడు. టీమ్‌ఇండియా బౌలర్లలో మహ్మద్ షమి, సిరాజ్, శార్దూల్ ఠాకూర్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
అయితే టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు శుభారంభం దక్కలేదు. సిరాజ్ వేసిన 3.4 ఓవర్‌కు ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (0) వికెట్ కీపర్ శ్రీకర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చాడు. తర్వాత లబుషేన్‌తో కలిసి మరో ఓపెనర్ వార్నర్ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. లబుషేన్ నెమ్మదిగా ఆడినా.. వార్నర్ నిలకడగా బౌండరీలు బాదాడు.
ఉమేశ్ వేసిన 15వ ఓవర్లో ఏకంగా నాలుగు ఫోర్లు కొట్టాడు. వార్నర్ దూకుడుకు శార్దూల్ అడ్డుకట్ట వేశాడు. ఠాకూర్ వేసిన 21.4 ఓవర్‌కు వార్నర్ కేఎస్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో భోజన విరామ సమయానికి ఆసీస్ రెండు వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. లంచ్ నుంచి రాగానే మంచి టచ్ మీద కనిపిస్తున్న లబుషేన్‌ను షమి బౌల్డ్ చేశాడు.
-
The first centurion in World Test Championship Final history 🥇
— ICC (@ICC) June 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Take a bow, Travis Head 👏
Follow the #WTC23 Final 👉 https://t.co/wJHUyVnX0r pic.twitter.com/PFyd7UzcZX
">The first centurion in World Test Championship Final history 🥇
— ICC (@ICC) June 7, 2023
Take a bow, Travis Head 👏
Follow the #WTC23 Final 👉 https://t.co/wJHUyVnX0r pic.twitter.com/PFyd7UzcZXThe first centurion in World Test Championship Final history 🥇
— ICC (@ICC) June 7, 2023
Take a bow, Travis Head 👏
Follow the #WTC23 Final 👉 https://t.co/wJHUyVnX0r pic.twitter.com/PFyd7UzcZX
WTC Final Australia : 76 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాను ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ ఆదుకున్నారు. ఆరంభంలోనే చాలా నెమ్మదిగా ఆడినా.. హెడ్ క్రీజులోకి రావడంతోనే దూకుడుగా ఆడాడు. నిలకడగా బౌండరీలు బాదాడు. 60 బంతుల్లో అర్ధ శతకం అందుకున్న హెడ్ .. దూకుడు కొనసాగించాడు. ఈ క్రమంలో టీ విరామ సమయానికి ఆసీస్ 170/3తో నిలిచింది. చివరి సెషన్‌లో ఆరంభంలోనూ నెమ్మదిగా ఆడిన స్మిత్ క్రమంగా దూకుడు పెంచాడు. షమి వేసిన 59వ ఓవర్లో హెడ్ వరుసగా ఫోర్, సిక్స్ బాదగా.. ఉమేశ్ యాదవ్ వేసిన తర్వాతి ఓవర్‌లో స్మిత్ రెండు ఫోర్లు కొట్టాడు.
WTC Final Day 1 Score : సిరాజ్ వేసిన 62 ఓవర్‌లో స్మిత్ అర్ద శతకం (144 బంతుల్లో) అందుకున్నాడు. షమి వేసిన 65వ ఓవర్లో హెడ్ సెంచరీ (106 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. అర్ధ శతకం చేసిన తర్వాత స్టీవ్ స్మిత్ దూకుడు పెంచాడు. సిరాజ్ వేసిన 66వ ఓవర్‌లో చివరి బంతిని బౌండరీకి పంపిన అతడు.. శార్దూల్ వేసిన 68 ఓవర్లోనూ ఓ ఫోర్ బాదాడు. జడేజా వేసిన 69వ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు రాబట్టాడు. వీరిద్దరూ క్రీజులో పాతుకుపోయి నిలకడగా బౌండరీలు సాధించడంతో స్కోరు 300 దాటింది.
-
Stumps on Day 1 🏏
— ICC (@ICC) June 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Indian bowlers were made to toil as Travis Head and Steve Smith put Australia in control 👊
Follow the #WTC23 Final 👉 https://t.co/wJHUyVnX0r pic.twitter.com/29K7u7rcPR
">Stumps on Day 1 🏏
— ICC (@ICC) June 7, 2023
Indian bowlers were made to toil as Travis Head and Steve Smith put Australia in control 👊
Follow the #WTC23 Final 👉 https://t.co/wJHUyVnX0r pic.twitter.com/29K7u7rcPRStumps on Day 1 🏏
— ICC (@ICC) June 7, 2023
Indian bowlers were made to toil as Travis Head and Steve Smith put Australia in control 👊
Follow the #WTC23 Final 👉 https://t.co/wJHUyVnX0r pic.twitter.com/29K7u7rcPR