ETV Bharat / sports

Warner: సాహా.. ఆ గది సంఖ్య318? - వృద్ధిమాన్​ సాహా 318 నంబరు

టీమ్​ఇండియా వికెట్​కీపర్​ వృద్ధిమాన్​ సాహాకు(Wriddhiman Saha) ఆసీస్​ బ్యాట్స్​మన్​ వార్నర్​కు(warner) ఓ ప్రశ్న సంధించాడు. 'ఆ గది నంబర్ 318ఆ' అని అడిగాడు. ఎందుకంటే?

Warner
వార్నర్
author img

By

Published : Jun 3, 2021, 9:51 PM IST

టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహాకు(Wriddhiman Saha) ఆసీస్‌ విధ్వంసకర ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌(warner) ఓ ప్రశ్న వేశాడు! 'ఆ గది నంబర్‌ 318?' కదా అని అడిగాడు. ఎందుకంటారా? సాహా సౌథాంప్టన్‌ మైదానం ఫొటోను పంచుకోవడమే కారణం.

ముంబయిలో క్వారంటైన్‌ అయిన టీమ్‌ఇండియా(TeamIndia) మహిళల, పురుషుల జట్లు ఒకే విమానంలో ఇంగ్లాండ్​కు బయలుదేరారు. వీరంతా లండన్‌ చేరుకున్నారు. అక్కడి నుంచి సౌథాంప్టన్‌ మైదానానికి వెళ్లారు. ఎందుకంటే అక్కడ హోటళ్ల సదుపాయం ఉండటమే కారణం. ఆటగాళ్లంతా తమ తమ గదుల్లోకి వెళ్లాక అక్కడి చిత్రాలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.

వికెట్‌ కీపర్ వృద్ధిమాన్‌ సాహా తన గది బాల్కనీలో నిలబడి ఓ సెల్ఫీ తీసుకున్నాడు. అందులో సౌథాంప్టన్‌ మైదానం అందంగా దర్శనమిచ్చింది. 'ఇది మా గది బాల్కనీ నుంచి కనిపిస్తున్న దృశ్యం. మీకేం అనిపిస్తోంది?' అని ఓ వ్యాఖ్య పెట్టాడు. దానికి డేవిడ్‌ వార్నర్‌ స్పందించాడు. 'అది రూమ్‌ నంబర్‌ 318?' అని అడిగాడు. ఎందుకంటే గతంలోనూ ఆసీస్‌ అక్కడ ఎన్నో మ్యాచులు ఆడింది. ఇక వార్నర్‌, సాహా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కే ఆడారు.

ఇదీ చూడండి ఇదీ చూడండి T20 WC: ఐసీసీని గడువు కోరనున్న బీసీసీఐ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.