ETV Bharat / sports

WPL 2023: అదరగొట్టిన కనిక.. చివర్లో మెరిసిన రిచా.. ఎట్టకేలకు ఆర్సీబీ బోణీ - మహిళల ప్రీమియర్ లీగ్​ యూపీ

డబ్ల్యూపీల్​లో రాయల్​ ఛాలెంజర్స్​ జట్టు ఖాతా తెరిచింది. యూపీ వారియర్స్​తో జరిగిన మ్యాచ్​లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Mar 15, 2023, 10:51 PM IST

Updated : Mar 15, 2023, 10:59 PM IST

మహిళల ప్రీమియర్​ లీగ్​లో రాయల్​ ఛాలెంజర్స్​ ఎట్టకేలకు బోణీ కొట్టింది. యూపీ వారియర్స్​తో జరిగిన మ్యాచ్​లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. యూపీ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని స్మృతి మంధాన సేన.. 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. డబ్ల్యూపీఎల్​ తొలి సీజన్​ పాయింట్ల పట్టికలో ఆర్సీబీ ఖాతా తెరిచింది.

యూపీ జట్టు నిర్దేశించిన స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన ఆర్సీబీకి ఆదిలోనే షాక్​ తగిలింది. ఓపెనర్​ సోఫీ డివైన్​ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించి విఫలమైంది. ఆ తర్వాత మరో ఓపెనర్​, కెప్టెన్​ స్మృతి​.. మరోసారి నిరాశపరిచింది. డకౌట్​గా వెనుదిరిగింది. అనంతరం క్రీజులోకి వచ్చిన పెర్రీ కూడా స్పల్ప పరుగులే చేసి ఔట్​ అయింది. హేథర్​ నైట్​ దూకుడు ఆడేందుకు యత్నించి.. 24 పరుగులు సాధించి పెవిలియన్​కు చేరింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కనిక అహుజా, రిచా ఘోష్​ స్కోరు బోర్డు పరిగెత్తించారు. 46 పరుగులు సాధించిన కనిక అహుజా ఔటైంది. రిచా ఆఖర్లో మెరిసింది. జట్టును విజయతీరాలకు చేర్చింది. యూపీ వారియర్స్​ బౌలర్లలో దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టగా.. గ్రేస్​ హారిస్​, దేవికా వైద్య, ఎకిల్​ స్టోన్​ తలో వికెట్​ తీశారు.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన యూపీ జట్టు.. 19.3 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది. గ్రేస్ హారిస్ (46; 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించగా.. కిరణ్‌ నవ్‌గిరె (22), దీప్తి శర్మ (22) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో ఎల్లీస్‌ పెర్రీ మూడు వికెట్లు పడగొట్టగా.. సోఫీ డివైన్‌, ఆశా శోభనా రెండేసి వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. మేఘన్ స్కట్, శ్రేయంకా పాటిల్ తలో వికెట్ తీశారు.

ఇన్నింగ్స్‌ మొదటి ఓవర్లోనే దేవికా వైద్య (0), అలీసా హేలీ (1)ని పెవిలియన్‌కు పంపి యూపీని గట్టి దెబ్బ కొట్టింది సోఫీ డివైన్‌. మేఘన్‌ స్కట్ వేసిన తర్వాతి ఓవర్లో తాహిలా మెక్‌గ్రాత్ (2) వికెట్‌ కీపర్‌ రిచా ఘోష్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరింది. దీంతో ఐదు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన యూపీని గ్రేస్‌ హారిస్‌ ఆదుకుంది. కిరణ్‌ నవ్‌గిరెతో కలిసి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టింది. నిలకడగా ఆడుతున్న నవ్‌గిరెను ఏడో ఓవర్లో ఆశా శోభనా ఔట్‌ చేసింది. తర్వాత క్రీజులోకి వచ్చిన సిమ్రాన్ షేక్ (2) కూడా శోభనానే వెనక్కి పంపింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. గ్రేస్‌ హారిస్‌ నిలకడగా ఆడింది. శ్రేయాంకా పాటిల్ వేసిన 11 ఓవర్లో ఓ సిక్స్‌, ఫోర్‌ బాదింది. శోభనా వేసిన 12 ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్స్‌ రాబట్టింది. దీప్తి శర్మ, హారిస్‌లను పెర్రీ ఒకే ఓవర్లో ఔట్‌ చేసింది. తర్వాత వచ్చిన శ్వేత (6), అంజలి (8), రాజేశ్వరి గైక్వాడ్ (12) పరుగులు చేశారు.

Last Updated : Mar 15, 2023, 10:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.