ETV Bharat / sports

WPL 2023: మెరిసిన దిల్లీ బ్యాటర్లు.. బెంగళూరుకు మళ్లీ నిరాశే.. - మహిళల ప్రీమియర్​ లీగ్​ పాయింట్ల పట్టిక

మహిళల ప్రీమియర్​ లీగ్​లో బెంగళూరు జట్టుకు మళ్లీ నిరాశే ఎదురైంది. దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచ్​లో ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

wpl 2023 dc vs rcb
wpl 2023 dc vs rcb
author img

By

Published : Mar 13, 2023, 10:46 PM IST

Updated : Mar 13, 2023, 10:56 PM IST

మహిళల ప్రీమియర్​ లీగ్​లో భాగంగా దిల్లీ క్యాపిటల్స్​ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. సోమవారం.. రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టుతో జరిగిన లీగ్​ మ్యాచ్​లో ఆరు వికెట్ల తేడాతో దిల్లీ విజయం సాధించింది. ఇన్నింగ్స్​లో ఇంకో రెండు బంతులు ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. ఇప్పటికే వరుస ఓటములతో కొట్టుమిట్టాడుతున్న ఆర్సీబీకి మళ్లీ నిరాశే ఎదురైంది.

ఆర్సీబీ నిర్దేశించిన 151 పరుగుల మోస్తరు లక్ష్యంతో దిల్లీ బరిలోకి దిగింది. గత మ్యాచ్​లో అదరగొట్టిన ఓపెనర్ షెఫాలీ వర్మ ఈ మ్యాచ్​లో నిరాశపరిచింది. డకౌట్​గా వెనుదిరిగింది. తర్వాత క్రీజులోకి వచ్చిన కాప్సే దూకుడుగా ఆడింది. కానీ ప్రీతి బోస్​ బౌలింగ్​.. పెర్రీకి క్యాచ్​ ఇచ్చి ఔట్​గా వెనుదిరిగింది. ఆ తర్వాత మరో ఓపెనర్​ మెగ్​ లానింగ్​ కూడా 15 పరుగులు చేసి పెవిలియన్​ చేరింది. అనంతరం మైదానంలోకి వచ్చిన జెమీమా రోడ్రిగ్స్​ స్కోరు బోర్డు స్పీడ్​ పెంచేందుకు ప్రయత్నించింది. కానీ ఆశా శోభన బౌలింగ్​లో 32 పరుగులు చేసి ఔటయ్యింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాటర్లు మరిజేన్​ కాప్(32), జొనాసెన్(29)​ ధాటిగా ఆడారు. జట్టును విజయతీరాలకు చేర్చారు.

తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఎల్లీస్‌ పెర్రీ (67; 52 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ శతకంతో మెరసింది. మరో బ్యాటర్​ రిచా ఘోష్‌ (37; 16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడింది. కెప్టెన్‌ స్మృతి మంధాన (8), హెథర్‌ నైట్‌ (11) నిరాశపరిచారు. సోఫీ డివైన్‌ (21) ఫర్వాలేదనిపించింది. శ్రేయంకా పాటిల్‌ (4*) పరుగులు చేసింది. దిల్లీ బౌలర్లలో శిఖా పాండే మూడు వికెట్లతో ఆకట్టుకోగా.. తారా నోరిస్ ఒక వికెట్‌ను ఖాతాలో వేసుకుంది.

మహిళల ప్రీమియర్​ లీగ్​లో భాగంగా మంగళవారం.. ముంబయి ఇండియన్స్​, గుజరాత్​ జెయింట్స్​ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికి ఆడిన నాలుగు మ్యాచుల్లో విజయం సాధించిన ముంబయి జట్టు.. పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది. గుజరాత్​ జట్టు మాత్రం ఆడిన నాలుగు మ్యాచుల్లో ఒక్కటే గెలిచి నాలుగో స్థానంలో ఉంది. మరి ముంబయి వరుస విజయ యాత్రకు గుజరాత్​ బ్రేక్​ వేస్తుందో లేదో చూడాలి.

Last Updated : Mar 13, 2023, 10:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.