ETV Bharat / sports

WTC Final: అత్యధిక పరుగుల వీరులు వీరే!

రెండేళ్ల క్రితం ప్రారంభమైన టెస్టు ఛాంపియన్​షిప్ ఎట్టకేలకు తుదిదశకు చేరుకుంది. ఈ టోర్నీ ఫైనల్ (WTC Final) జూన్ 18న భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాళ్లెవరో చూద్దాం.

WTC scores
డబ్ల్యూటీసీ రన్స్
author img

By

Published : Jun 10, 2021, 9:16 AM IST

టెస్టు క్రికెట్‌ అంటేనే సుదీర్ఘమైన ఆట. ఐదు రోజుల పాటు ఇరు జట్లూ పోటాపోటీగా తలపడి చివరికి ప్రత్యర్థిని రెండుసార్లు తమకన్నా తక్కువ స్కోరుకే ఆలౌట్‌ చేయాలి. ఈ క్రమంలో బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేయాలన్నా, బౌలర్లు వికెట్లు తీయాలన్నా గంటల తరబడి మైదానంలో పోరాడాలి. అయితే, ఇలాంటి ఆటను చూడటానికి కొన్నేళ్లుగా అభిమానులు ఆసక్తి చూపడం లేదు. దాంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ లాంటి మెగా ఈవెంట్‌తో ఐసీసీ ముందుకొచ్చింది. రెండేళ్ల క్రితం దీన్ని ప్రారంభించగా అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. క్రికెటర్లు కూడా బాగా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండేళ్లలో ఈ టోర్నీలో అదరగొట్టిన టాప్‌ బ్యాట్స్‌మెన్‌ ఎవరో, ఎన్ని మ్యాచ్‌ల్లో ఎన్ని పరుగులు చేశారో ఓసారి వివరంగా తెలుసుకుందాం.

మార్నస్ లబుషేన్‌..

labuschange
లబుషేన్

ఈ టోర్నీలో అందరికన్నా ఎక్కువ పరుగులు చేసింది ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ మార్నస్‌ లబుషేన్‌ (Marnus Labuschagne). ఆసీస్‌ మొత్తం నాలుగు సిరీస్‌ల్లో 14 మ్యాచ్‌ల్లో తలపడగా లబుషేన్‌ 13 మ్యాచ్‌ల్లో భాగస్వామి అయ్యాడు. అందులో అతడు 23 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌ చేసి 1,675 పరుగులు సాధించాడు. దాంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పోటీల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అతడు 2,999 బంతులు ఎదుర్కోగా 55.85 స్ట్రైక్‌రేట్‌తో 72.82 సగటు నమోదు చేశాడు. ఈ క్రమంలోనే ఐదు శతకాలు, తొమ్మిది అర్ధశతకాలు సాధించాడు. అలాగే 186 బౌండరీలు, 3 సిక్సర్లు సాధించాడు. ఈ టోర్నీలో లబుషేన్‌ అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ 215.

జో రూట్‌..

root
రూట్

ఇక రెండో అత్యధిక పరుగులు చేసింది ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ (Joe Root). ఈ టోర్నీలో ఆ జట్టు మొత్తం ఆరు సిరీస్‌ల్లో తలపడగా 21 మ్యాచ్‌లు ఆడింది. రూట్‌ ఒక్క మ్యాచ్‌ మినహాయించి 20 మ్యాచ్‌ల్లో 37 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌ చేసి 1,660 పరుగులు సాధించాడు. ఇన్ని పరుగులు చేయడానికి అతడు ఎదుర్కొన్న బంతులు 3,037. ఇక 54.65గా స్ట్రైక్‌రేట్‌ నమోదు కాగా సగటు 47.42గా నమోదైంది. అందులో మూడు శతకాలు, ఎనిమిది అర్ధశతకాలు ఉన్నాయి. బౌండరీల విషయానికొస్తే రూట్‌ 168 ఫోర్లు, 5 సిక్సర్లు సాధించాడు. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ 228 పరుగులు.

స్టీవ్‌ స్మిత్‌..

smith
స్మిత్

ఆస్ట్రేలియా జట్టులో అత్యంత కీలకమైన బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ (Steve Smith). అతడు ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఇంతకుముందు లబుషేన్‌ విషయంలో చెప్పుకొన్నట్లే స్మిత్‌ కూడా ఈ టోర్నీలో నాలుగు సిరీస్‌ల్లో కలుపుకొని 13 మ్యాచ్‌ల్లో పాలుపంచుకున్నాడు. అందులో 22 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌ చేసి 1,341 పరుగులు చేశాడు. స్మిత్‌ మొత్తం 2,509 బంతులు ఎదుర్కొని 53.44గా స్ట్రైక్‌రేట్‌ సాధించాడు. సగటు 63.85గా నమోదవ్వగా అందులో నాలుగు శతకాలు, ఏడు అర్ధశతకాలు సాధించాడు. అలాగే 151 ఫోర్లు, 7 సిక్సులు సాధించాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ 211 పరుగులు.

బెన్‌ స్టోక్స్‌..

stokes
స్టోక్స్

ఇక నాలుగో అత్యధిక పరుగులు సాధించింది ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ (Ben Stokes). ఒక ఆల్‌రౌండర్‌గా ఈ ఘనత సాధించడం గొప్ప విశేషమే. ఇంగ్లాండ్‌ ఆడిన ఆరు సిరీస్‌ల్లో 21 మ్యాచ్‌ల్లో తలపడగా అతడు ఆడింది 17 మ్యాచ్‌లే. అందులోనూ 32 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌ చేసి 1,334 పరుగులు సాధించాడు. అతడు ఎదుర్కొన్న బంతులు 2,308 కాగా స్ట్రైక్‌రేట్‌ 57.79గా నమోదైంది. ఇక సగటు 46గా నమోదైంది. ఈ క్రమంలోనే ఈ ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ నాలుగు శతకాలు, ఆరు అర్ధశతకాలు సాధించాడు. అందులో 142 ఫోర్లు, 31 సిక్సులు కొట్టడం విశేషం. అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ 176 పరుగులుగా నమోదు చేశాడు.

అజింక్యా రహానె..

rahane
రహానే

ఈ జాబితాలో టీమ్‌ఇండియా వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానె (Ajinkya Rahane) ఐదో స్థానంలో నిలిచాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ మొత్తం ఆరు సిరీస్‌ల్లో తలపడగా 17 మ్యాచ్‌లు ఆడింది. రహానె అన్నింటిలోనూ ఆడి 28 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌ చేసి 1,095 పరుగులు చేశాడు. అతడు ఎదుర్కొన్న బంతులు 2,317 కాగా స్ట్రైక్‌రేట్‌ 47.25గా నమోదైంది. అలాగే సగటు 43.80గా నమోదైంది. అందులో మూడు శతకాలు, ఆరు అర్ధశతకాలు సాధించాడు. బౌండరీల విషయానికొస్తే రహానె 125 ఫోర్లు, 6 సిక్సులు బాదాడు. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ 115 పరుగులుగా నమోదైంది.

రోహిత్‌ శర్మ..

rohit
రోహిత్

ఇక ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో వెయ్యి పరుగులపైన సాధించిన బ్యాట్స్‌మెన్‌లో రోహిత్‌ (Rohit Sharma) చివరి స్థానంలో నిలిచాడు. భారత్‌ ఆరు సిరీస్‌ల్లో 17 మ్యాచ్‌లు ఆడగా హిట్‌మ్యాన్‌ 11 మ్యాచ్‌ల్లోనే పాల్గొన్నాడు. అందులోనూ 17 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌ చేసి 1,030 పరుగులు చేశాడు. అతడు ఎదుర్కొన్న బంతులు 1,597. స్ట్రైక్‌రేట్‌ 64.49 కాగా సగటు 64.37గా నమోదైంది. అందులో నాలుగు శతకాలు, రెండు అర్ధశతకాలు ఉన్నాయి. అలాగే 123 ఫోర్లు, 27 సిక్సులు బాదాడు. ఈ క్రమంలోనే అతడు అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ 212 పరుగులు సాధించాడు.

ఇక్కడ చెప్పుకున్న వాళ్లంతా ఈ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో వెయ్యికిపైగా పరుగులు చేసిన వారే. ఇందులో ఇద్దరు ఆస్ట్రేలియన్లు, ఇద్దరు ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఉండగా, టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ కూడా ఇద్దరుండటం విశేషం. ఇక టీమ్‌ఇండియా జూన్‌ 18 నుంచి న్యూజిలాండ్‌తో ఫైనల్లో (WTC Final)పోటీపడనున్న నేపథ్యంలో రహానె, రోహిత్‌ ఇంకెన్ని పరుగులు చేస్తారో చూడాలి. వాళ్లిద్దరూ చెరో సెంచరీ కొట్టి కోహ్లీసేన విజయం సాధిస్తే భారత అభిమానులకు పండగ లాంటిదే.

ఇవీ చూడండి: టెస్టుల్లో అత్యధిక సిక్స్​ల వీరులు వీరే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.