ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(World Test Championship) ఫైనల్‌పై రోజురోజుకు అభిమానుల్లో క్రేజ్ పెరుగుతోంది. జూన్ 18న సౌతాంప్టన్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఆటగాళ్లే కాకుండా అభిమానులు సిద్ధమవుతున్నారు. అయితే మ్యాచ్ టిక్కెట్టు రేటు రూ.2 లక్షలకు పైగా ధర పలుకుతున్నట్లు తెలుస్తోంది.
ఇంగ్లాండ్ గడ్డపై జరిగే ఈ మ్యాచ్‌కు 4000 మంది ప్రేక్షకులను అనుమతించనున్నారు. అందులో కొంతమందికి బ్యాలెట్ విధానంలో టిక్కెట్లు జారీ చేశారు. మిగిలిన వాళ్లకు టిక్కెట్ ఏజెన్సీల ద్వారా టిక్కెట్లను విక్రయించనున్నారు. ఈ క్రమంలో ఒక్కో దాని ధర రూ.2 లక్షలపైగా ఉందని ఓ ఏజెన్సీ నిర్వహకుడు చెప్పాడు.
టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ తర్వాత ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది టీమ్ఇండియా. ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 మధ్య ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఇవీ చదవండి: